E-Paper
Advertisement

AP Fake Votes: ఏపీలో దొంగ ఓట్లు.. పోటాపోటీగా ఈసీకి కంప్లైంట్ చేసిన పార్టీలు

AP Fake Votes: ఏపీలో దొంగ ఓట్లు.. పోటాపోటీగా ఈసీకి కంప్లైంట్ చేసిన పార్టీలు
Advertisement

AP Fake Votes(Latest news in Andhra Pradesh):

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. మాల్‌ ప్రాక్టీస్‌పై వైసీపీ, దొంగ ఓట్లపై విపక్ష పార్టీలు బీజేపీ, టీడీపీలు పోటాపోటీగా గురువారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. తొలుత వైసీపీ ఎంపీలు ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. పీపుల్స్‌‌‌‌ రిప్రెజెంటేషన్‌‌‌‌ యాక్ట్‌ను ఉల్లంఘిస్తూ ఎన్నికల సంఘం డేటాను దుర్వినియోగం చేస్తూ టీడీపీ మాల్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌కు పాల్పడుతున్నదని కంప్లైట్ చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన దొంగ ఓట్ల మాల్‌‌‌‌ప్రాక్టీస్‌‌‌‌పై అనేక అంశాల్ని కమిషన్‌‌‌‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు.. విజయసాయిరెడ్డి తెలిపారు.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీలే ఈసీఐకి కంప్లైట్ చేయడం దురదృష్టకరమని టీడీపీ ఎంపీ కనకమేడల విమర్శించారు. 10 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తామిచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదన్నారు. అందుకే ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నెల 22న రాష్ట్రానికి వస్తామని ఈసీఐ ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిపారు.

Advertisement

ఏపీలో దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఆధారాలు సమర్పించినట్లు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ఆమె నేతృత్వంలో ఎంపీలు సీఎం రమేశ్, సుజనా చౌదరి, ముఖ్య నేతలు సత్యకుమార్, భానుప్రకాష్ రెడ్డి ఈసీఐ అధికారులతో భేటీ అయ్యారు.

.

Advertisement

.

Related News

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×