BigTV English

Ram Charan as a Chief Guest: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా రామ్ చరణ్..!

Ram Charan as a Chief Guest: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అతిథిగా రామ్ చరణ్..!

Ram Charan as a Chief Guest for Chandrababu Oath: ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అఖండ విజయం సాధించింది. 175 స్థానాల్లో ఈ కూటమి 164 సీట్లు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు జూన్ 12న ఉదయం 11.27 నిమిషాలకు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు పెద్దఎత్తున రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి చెర్రీకి ఆహ్వానం సైతం అందినట్లు సమాచారం.


చెర్రీ గ్రీన్ సిగ్నల్..

విజయవాడ కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జరగనున్న చంద్రబాబు స్వీకార మహోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్‌కు ఆహ్వానం అందడంతో వస్తున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబు, మెగా హీరో రామ్ చరణ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే జనసేన రాష్ట్రంలో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించగా.. జనసేన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.


Also Read: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో భాగంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈమెతోపాటు తెలుగు హీరోయిన్ అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. ఇక.. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. దసరా కానుకగా విడుదల కానుందని మేకర్స్ చెబుతున్నారు. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Tags

Related News

Heavy Rains in AP: బాబోయ్ .. కుమ్మేస్తున్న వానలు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

Pulivendula Politics: జగన్‌కు కూటమి కౌంటర్.. బాయ్ కాట్ కాదు, బావిలో పడండి

Jagan on Pulivendula: జగన్ ప్రెస్‌మీట్.. పుటేజ్ బయటపెడతారా? ఓటమిని అంగీకరించినట్టేనా?

AP Liquor Shops: మందుబాబులకు గుడ్ న్యూస్! కొత్త జీవో పూర్తి వివరాలు..

Pulivendula ZP: పులివెందుల జెడ్పీ.. ఆ ముగ్గురు వ్యూహం, బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్

Jagan: కూలిపోతున్న పులివెందుల కోట.. తప్పు ఎక్కడ జరిగింది? టెన్షన్‌లో జగన్‌

Big Stories

×