BigTV English

Tirumala temple news : చిన్నారులకు ట్యాగ్స్.. తిరుమల నడకమార్గంలో ఆంక్షలు..

Tirumala temple news :  చిన్నారులకు ట్యాగ్స్.. తిరుమల నడకమార్గంలో ఆంక్షలు..
Tirupati latest news today

Tirupati latest news today(Andhra news updates):

చిన్నారి లక్షితపై చిరుత దాడి తర్వాత టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నడక దారిలో ఇకపై చిన్నారులను తీసుకెళ్లడంపై ఆంక్షలు విధించింది. ఆరేళ్ల చిన్నారి లక్షితపై అత్యంత దారుణంగా చిరుత దాడి చేసి చంపిన తర్వాత టీటీడీ అధికారులు కొత్త ఆంక్షలను విధించారు. తిరుమలకు నడక మార్గాల్లో వచ్చే చిన్నారుల భద్రతపై దృష్టి సారించారు.


ఇకపై నడక మార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో ఈ ఆంక్షలను అమలు చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరిస్తామన్నారు. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతిస్తామని తెలిపారు.

ఏడో మైలు వద్ద చిన్నారుల చేతికి ట్యాగులు వేస్తున్నారు. చిన్న పిల్లలు తప్పిపోయినా, అనుకోని ఘటనలు జరిగినా వారిని గుర్తించేందుకు ఈ ట్యాగులు ఉపయోగపడతాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ట్యాగ్స్ పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, టోల్‌ ఫ్రీ నంబర్‌ నమోదు చేస్తున్నారు. అలిపిరి–తిరుమల మార్గంలో వంద మంది భక్తులను గుంపుగా పంపుతున్నారు. ముందు , వెనుక రోప్ ఏర్పాటు చేసి సెక్యూరిటీ గార్డులను వారికి రక్షణగా పంపుతున్నారు. అదే సమయంలో రెండో ఘాట్‌ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేశారు.


మరోవైపు చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. చిరుతల సంచారంపై నిఘా పెట్టారు. ఇందుకోసం టీమ్‌లను ఏర్పాటు చేశారు. నడకమార్గం పరిధిలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×