BigTV English

MiG-29 fighter jets : చైనా, పాక్ కు చెక్ పెట్టే వ్యూహం.. ఎలాగంటే..?

MiG-29 fighter jets : చైనా, పాక్ కు చెక్ పెట్టే వ్యూహం.. ఎలాగంటే..?
MiG-29 fighter jets latest news


MiG-29 fighter jets latest news(India today news): పాకిస్థాన్‌, చైనాలకు చెక్‌ పెట్టేలా వ్యూహాలకు పదును పెట్టింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. శ్రీనగర్‌లోని ఎయిర్‌బేస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న మిగ్‌-21 స్క్వాడ్రన్ల స్థానంలో మిగ్‌-29 స్క్వాడ్రన్లను మోహరించింది. డిఫెండర్ ఆఫ్ ది నార్త్‌గా గుర్తింపు పొందిన ట్రైడెంట్స్ స్క్వాడ్రన్.. పాకిస్థాన్, చైనా నుంచి వచ్చే ప్రమాదాలను నివారించేందుకు మోహరించింది IAF.

కశ్మీర్‌ లోయ మధ్యలో శ్రీనగర్‌ ఉంటుంది. మైదానాల కంటే ఎత్తులో ఉంటుంది. అందుకే సరిహద్దులకు సమీపంలో ఉండే ఎయిర్‌బేస్‌ల్లో వేగంగా స్పందించే యుద్ధ విమానాలను మోహరించడం ఉత్తమమని IAF భావిస్తోంది. ఈ ఫైటర్‌ జెట్స్‌ లాంగ్‌ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేవైతే.. మరింత అడ్వాంటేజ్‌ ఉంటుంది. ఈ సామర్థ్యాలన్ని మిగ్‌-29కు ఉన్నాయని IAF చెబుతోంది. రెండు దేశాలు దాడి చేసిన ఈ స్క్వాడ్రన్‌కు ఎదుర్కోనే శక్తి ఉంటుందని ప్రకటించింది.


కశ్మీర్ లోయను చాలా ఏళ్ల నుంచి రక్షిస్తున్న మిగ్-21 కంటే మిగ్‌- 29లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. 2019లో బాలాకోట్ ఎయిర్‌ స్ట్రైక్స్‌లో ఉగ్రవాద శిబిరాలపై దాడి, పాక్ F-16లను కూల్చివేతలో కీలకంగా వ్యవహరించాయి. అప్‌గ్రేడ్ చేసిన మిగ్‌ 29 నుంచి ఎయిర్‌ టు ఎయిర్‌.. ఎయిర్‌ టు గ్రౌండ్‌ ప్రయోగించే లాంగ్‌ రేంజ్ మిస్సైల్స్‌, ఆయుధాలు, అత్యవసర సమయంలో సాయుధ దళాల ఉపయోగానికి ప్రభుత్వం అందజేసిన శక్తివంతమైన ఆయుధాలు కూడా ఉన్నాయి.

అంతేకాదు నైట్ విజన్ మోడ్.. ఎయిర్‌ రిఫీల్లింగ్‌ కూడా మిగ్‌-29లకు ఉందని IAF అధికారులు చెబుతున్నారు. సరిహద్దుల్లో ఏదైనా ప్రతిష్టంభన ఏర్పడితే వెంటనే వీటిని రంగంలోకి దించవచ్చంటున్నారు. మిగ్‌-29లను జనవరిలోనే శ్రీనగర్‌ ఎయిర్‌బేస్‌కి తరలించగా.. లడఖ్ సెక్టార్‌తో పాటు కశ్మీర్ లోయలో విస్తృతంగా ప్రయాణించాయి. ఒకవేళ చైనా గగనతల ఉల్లంఘనకు ప్రయత్నిస్తే మొదట రియాక్టయ్యే వాటిలో ఈ ఫైటర్ జెట్సే ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×