E-Paper
Advertisement

TDP Protest : టీడీపీ బీసీ నేతపై ఎస్ఐ దాడి.. గుంటూరులో ఉద్రిక్తత..

TDP Protest :  టీడీపీ బీసీ నేతపై ఎస్ఐ దాడి.. గుంటూరులో ఉద్రిక్తత..
Advertisement

TDP Protest : గుంటూరులో టీడీపీ బీసీ నేతలు చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ ను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో కాసేపు తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ యాదవ్‌ పై ఎస్ఐ నాగరాజు పిడిగుద్దులు గుద్దడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఒంగోలులో సాగింది. ఆ సమయంలో టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంపై వైసీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చారంటూ వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మంత్రి జోగి రమేశ్‌ విమర్శలు చేశారు.

Advertisement

మోపిదేవి, జోగి రమేశ్ కామెంట్స్ పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గుంటూరు లాడ్జ్ సెంటర్‌లో వైసీపీ నేతల దిష్టిబొమ్మ దహనం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. టీడీపీ నేతల చర్యలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ యాదవ్‌పై ఎస్ఐ నాగరాజు చేయిచేసుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. పోలీసుల తీరును నిరసిస్తూ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద టీడీపీ బీసీ నాయకులు నిరసన కొనసాగించారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Related News

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×