Jackie Chan: ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఏ చిన్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. అయితే ఈ సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు కొంతమంది చేసే పోస్టులు ఎన్నో విమర్శలకు కారణం అవ్వడం అలాగే తప్పుడు వార్తలను ప్రచారం చేయడంతో ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇలా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల ఒక నటుడు లేదా నటి హాస్పిటల్ వెళ్తే వారు చనిపోయారనే వార్తలను కూడా సృష్టిస్తున్నారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సెలబ్రిటీలను ఇప్పటికే బ్రతికుండగానే చంపేశారు. చివరికి ఆ సెలబ్రిటీలు స్పందిస్తూ మేము చనిపోలేదు బ్రతికే ఉన్నామని చెప్పుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే చనిపోయారనే వార్తలు బయటకు రావడంతో చివరికి ఈ వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ధర్మేంద్ర విషయం మర్చిపోకముందే మరొక నటుడి విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యాక్షన్ స్టార్ జాకీ చాన్(Jackie Chan) మరణించారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జాకీచాన్ ప్రస్తుతం 71 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ ఈయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇలా ఆరోగ్యంగా ఉన్న ఈయన హాస్పిటల్ బెడ్ పై ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. నేడు ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన వ్యక్తి,కుంగ్ ఫూ ఆటగాడు జాకీచాన్ మరణించారు అంటూ ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇలా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎంతో మంది అభిమానులు స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ ఎందుకని జాకీ చాన్ ను చంపాలనుకుంటుంది అంటూ నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Facebook’s latest fake news: Jackie Chan has passed.
He hasn’t. pic.twitter.com/fxBdLGuRCf
— Digital Gal 🌸 (@DigitalGal_X) November 10, 2025
ఇకపోతే సోషల్ మీడియా జాకీ చాన్ ను టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఆయన మరణించారనే వార్తలను స్ప్రెడ్ చేశారు. అయితే ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ తాను చనిపోలేదని బ్రతికే ఉన్నానని వెల్లడించారు. ఇలా తరచూ ఈయన మరణానికి సంబంధించిన వార్తలను ప్రచారం చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు. ఇక జాకీచాన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన “న్యూ పోలీస్ స్టోరీ 2” , “ప్రాజెక్ట్ పి” ‘ఫైవ్ ఎగైనెస్ట్ ఎ బుల్లెట్’ వంటి వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
Also Read: Ram charan: మెగా ఫ్యాన్స్ కు షాక్ .. సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న చరణ్.. ఈ ప్రాజెక్ట్‌లపై ఎఫెక్ట్ ?