E-Paper
Advertisement

Attack on Pawan is Untrue: పవన్ పై దాడి ఘటన అవాస్తవం.. తేల్చేసిన పోలీసులు..!

Attack on Pawan is Untrue: పవన్ పై దాడి ఘటన అవాస్తవం.. తేల్చేసిన పోలీసులు..!
Advertisement

Attack on Pawan Kalyan in Tenali is Untrue: తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జరిగిన దాడి ఘటన వాస్తవం కాదని పోలీసులు తేల్చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన నాగేశ్వరరావు.. పవన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసే క్రమంలో చెయ్యి తగిలిందని అన్నారు. అయితే పవన్ అభిమానులు ఆ ఘటనను రాయి దాడిగా భావించి.. తనపై దాడి చేశారని బాధితుడు వాపోయారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తలు సైతం ఊపిరి పీల్చుకున్నారు. మంచి కంటే కూడా చెడు తొందరగా వ్యాపిస్తోందని.. ప్రజలు కొంచెం విజ్ఞతతో ఆలోచన చేయాలని పోలీస్ శాఖ కోరింది.

మరోవైపు టిడిపి అధినేత చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. రాళ్లు ముందున్న బారికేడ్లకు తాకడంతో చంద్రబాబుకు ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు వెంటనే అలెర్టవడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూటమి విజయం సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్ పై దాడి ఘటన తర్వాత.. నిన్న పవన్ కల్యాణ్, చంద్రబాబులపై కూడా దాడి జరిగిందన్న వార్తలు కలకలం రేపాయి. జగన్ పై దాడి జరగడంతో ఆ పార్టీకి చెందినవారే చంద్రబాబుపై రాళ్లు రువ్వారా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదని, ప్రచారంలో ఉన్న రాజకీయ నాయకులకు భద్రత ఉన్నా.. ఇలాంటి ఘటనలు జరుగుతుండటం దురదృష్టకరమని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: జగన్ ఈ నాటకాలు ఇకనైనా ఆపు.. చూడలేకపోతున్నాం: పవన్ కళ్యాణ్

Advertisement

ఇక జగన్ పై జరిగిన దాడి ఘటనపై ఈసీ సీరియస్ గా ఉంది. ఏపీలో కొంతమంది పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ఈసీ దృష్టిసారించింది. జగన్ బస్సు యాత్రలో మార్పులు చేశారు. యాత్ర సమయంలో గజమాలలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. బస్సుకు కొద్దిదూరంలో జనం ఉండేలా బారికేడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జగ్రత్తలు తీసకుంటున్నారు.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×