BigTV English

Stone Attack on Pawan Kalyan: పవన్ పై కూడా రాళ్ళ దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

Stone Attack on Pawan Kalyan: పవన్ పై కూడా రాళ్ళ దాడి.. తృటిలో తప్పిన ప్రమాదం

Stone Attack on Pawan Kalyan in Tenali: జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి యాత్ర చేపడుతున్న పవన్ కళ్యాణ్ పై ఓ వ్యక్తి రాయితో దాడికి యత్నించాడు.


ఒక్కసారిగా ఆ వ్యక్తి జనసేనాని మీదకి రాయి విసిరాడు.. అయితే ఆ రాయి పవన్ కళ్యాణ్ పై కాకుండా అతనికి దూరంగా పడింది. వెంటనే అప్రమత్తమైన జనసేన శ్రేణులు రాయి విసిరిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహిస్తుండగా ఈ ఘటన చేటుచేసుకుంది.

ఈ దాడియత్నం  జరిగినా సరే పవన్ కళ్యాణ్ వరాహియాత్రను కొనసాగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రతి నెలా ఐదో తేదీలోపలే ఉద్యోగులు జీతాలు అందిస్తామని పవన్ తెలిపారు. అధికార గర్వంతో ఊగిసలాడితే ప్రజలు తరిమికొడతారని.. శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే జగన్ కు కూడా పడుతుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.


Also Read: Chandrababu: విశాఖను వాణిజ్య రాజధాని చేస్తాం.. ఉత్తరాంధ్రులకు చంద్రబాబు కీలక హామీ

సీఎం జగన్ కు చిన్న గాయం అయితేనే రాష్ట్రం ఊగిపోయిందని.. తనకి కూడా భాద కలిగిందన్నారు. కానీ ఇదంతా ఓ కట్టుకథ అని జనసేనాని అన్నారు. నాన్న పులి కథ ఒక్కసారి చెబితేనే బాగుంటుందని.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి చెబితే ఎవ్వరూ నమ్మరని విమర్శించారు. జగన్ ఈ నాటకాలు ఇకనైనా ఆపాలని.. చూడలేకపోతున్నామన్నారు. ప్రజలు కూడా జగన్ చేసే ఇలాంటి డ్రామాలు నమ్మవద్దని సూచించారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×