భారతీయ రైల్వే ప్రయాణం, రైళ్లలో అందిస్తున్న సదుపాయాల పట్ల విదేశీయులు ఫిదా అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన ఓ ఫ్యామిలీ వందేభారత్ రైల్లో ప్రయాణించి, అందులో అందిస్తున్న స్నాక్స్ అద్భుతం అన్నారు. ముఖ్యంగా జింజర్ ఛాయ్ టేస్ట్ చూసి అబ్బురపడ్డారు. తాజాగా ఓ ఆస్ట్రేలియన్ ట్రావెలర్ ఇండియాలో రైలు ప్రయాణం చేసింది. రైళ్లలో కల్పిస్తున్న సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోయింది. రన్నింగ్ ట్రైన్ లో ఉండి, తాను ఆర్డర్ చేసిన ఫుడ్ వేడి వేడిగా డెలివరీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇలాంటి సర్వీసు ఆస్ట్రేలియాలో ఊహించలేమని చెప్పుకొచ్చింది.
బెక్ మెక్ కోల్ అనే ఆస్ట్రేలియా యువతి తాజాగా ఇండియాకు వచ్చింది. ఈ సందర్భంగా రైలు ప్రయాణం చేసింది. రన్నింగ్ ట్రైన్ లో ఉండగా తనకు నచ్చిన పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. కాసేపట్లోనే డెలివరీ ఏజెంట్ ఆమెను షెడ్యూల్ చేసిన స్టేషన్ స్టాప్ లో కలిసి, తను ఆర్డర్ చేసిన ఫుడ్ అందించాడు. కొద్ది నిమిషాల్లోనే తన సీటు దగ్గరికి ఫుడ్ డెలివరీ కావడం పట్ల మెక్ కోల్ ఆశ్చర్యపోయింది. “ఇండియాలో ఈ సదుపాయం అద్భుతంగా ఉంది. నేను కదులుతున్న రైలులో నాకు నచ్చిన పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఆన్ లైన్ ఆర్డర్ చేశాను. కొద్ది సేపట్లోనే డెలివరీ బాయ్ నన్ను రైలులో కలిశాడు. ఫుడ్ డెలివరీ ఇచ్చాడు. ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి సౌకర్యాన్ని ఆస్ట్రేలియాలో కూడా పొందలేం. ఫుడ్ డెలివరీ విషయంలో మా దేశంతో పోల్చితే ఇండియా చాలా ముందుంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియో ఆన్ లైన్ లో బాగా వైరల్ అయ్యింది. పలు దేశాలకు చెందిన నెటిజన్లు ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. ఇండియన్ రైల్వే అదిస్తున్న సర్వీసుల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “భారతీయ రైల్వే ప్రపంచ రైల్వేలో టాప్ 4లో ఉంది. గత దశాబ్దకాలంగా మరింత అభివృద్ది చెందుతోంది. సరికొత్త రైళ్ల నుంచి మొదలుకొని, రైళ్లలో అందించే సేవల వరకు బాగా అప్ డేట్ అవుతున్నాయి. మీరు మళ్లీ ఇండియాకు వచ్చేసరికి ఇండియన్ రైల్వే మరో లెవల్ లో ఉంటుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. భారతీయ రైల్వేలో ఆన్ బోర్డ్ ఫుడ్ సెలెక్షన్, ఇ క్యాటరింగ్ సేవల పట్ల విదేశీ నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. బ్రిటిష్, కెనడియన్ వ్లాగర్లతో సహా ఇతర విదేశీ ప్రయాణికుల పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మొత్తంగా ఇండియన్ రైల్వే పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Read Also: షాకింగ్.. గుట్కా మరకలు క్లీన్ చేసేందుకు రైల్వే ఏడాదికి అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా?