E-Paper
Advertisement

Congress: షర్మిలకు చెక్ పెట్టారా? విలీనం మళ్లీ మొదటికొచ్చిందా?

Congress: షర్మిలకు చెక్ పెట్టారా? విలీనం మళ్లీ మొదటికొచ్చిందా?
Advertisement
SHARMILA

Congress: కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి. పార్టీలో కీలక నేత. రాహుల్, ఖర్గేల తర్వాత వ్యవహారాలన్నీ ఆయనే డీల్ చేస్తుంటారు. అలాంటి కేసీ వేణుగోపాల్.. లేటెస్ట్‌గా షర్మిల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో YSRTP విలీనంపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.

ఢిల్లీలో అసలు ఏం జరుగుతోంది? వేణుగోపాల్‌కు తెలీకుండా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మరి, కేసీకే తెలీకుండా.. షర్మిల పావులు కదుపుతున్నారా? డీకే శివకుమార్.. కేసీ వేణుగోపాల్‌నే బైపాస్ చేసి.. షర్మిలను అధిష్టానానికి దగ్గర చేస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Advertisement

మరోవైపు, ఇటీవల షర్మిల ఢిల్లీలో ఉన్న రెండురోజులూ.. డీకే మాత్రం బెంగళూరులోనే ఉన్నట్టు తెలుస్తోంది. అంటే, షర్మిల నేరుగా హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారా? డీకే కేవలం రాయబారానికి మాత్రమే పరిమితమయ్యారా? షర్మిల పార్టీ విలీనంపై ఢిల్లీ మదిలో ఏముంది? కోమటిరెడ్డి కావాలంటుంటే.. కీలక నేతలు వద్దంటున్నారా? షర్మిల చుట్టూ పెద్ద రాజకీయమే నడుస్తోందా? ఇలా అనేక ప్రశ్నలు.

షర్మిల.. డీకే శివకుమార్‌ను కలిసిన విషయం ఓపెన్ టాపిక్. కానీ, షర్మిల కాంగ్రెస్ పెద్దలను మీట్ అయిన మేటర్ మాత్రం సీక్రెట్ న్యూస్. ఆ భేటీకి సంబంధించి ఎలాంటి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదు. ఆ చర్చల్లో పాల్గొన్న ఎవరి పేర్లు వెల్లడికాలేదు. ఇంతకీ షర్మిల ఎవరిని కలిసినట్టు? రాహుల్‌నా? ఖర్గేనా? నేరుగా సోనియాగాంధీనేనా? వీరి ముగ్గురిలో ఎవరిని కలిసున్నా.. ఆ విషయం కేసీ వేణుగోపాల్‌కు పక్కాగా తెలుస్తుంది. షర్మిల ఢిల్లీకి వెళ్లారనే వరకు నిజం. మరి, నిజంగా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపారా? కావాలనే లీకులు ఇస్తున్నారా? సోనియాగాంధీ ఆఫీసు నుంచి అనిల్‌కుమార్‌కు ఫోన్ వచ్చిందనే విషయమైనా నిజమేనా? లేదంటే.. ప్రచార వ్యూహమా? ఇలా షర్మిల చుట్టూ అంతా కన్ఫ్యూజన్ నడుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వద్దంటున్నా.. ఆమెను పార్టీలో చేర్చుకుంటారా? అనే డౌట్ ఉండనే ఉంది. వైఎస్సార్‌టీపీ విలీనం ఉంటుందో లేదో చూడాలి.

Related News

ఫిఫా ఫైనల్ కురుక్షేత్రం.. 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. కన్నీళ్లతో మెస్సీ వీడ్కోలు!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

Big Stories

Advertisement
×