E-Paper
Advertisement

Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. డేట్స్ వచ్చేశాయ్, గురువారం నుంచే నమోదు

Tirumala News: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు.. డేట్స్ వచ్చేశాయ్, గురువారం నుంచే నమోదు
Advertisement

Tirumala News: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై మరోసారి క్లారిటీ ఇచ్చేసింది టీటీడీ. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించింది. డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చేసింది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలను తొలి మూడు రోజులకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే ప్రక్రియ ఈనెల 27న నుంచి మొదలుకానుంది.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు

Advertisement

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీగా వచ్చే భక్తుల రద్దీని నియంత్రించడానికి విస్తృతమైన ప్రణాళికను ఆవిష్కరించింది. 10 రోజుల దర్శనానికి టిక్కెట్ల జారీ, క్యూ నిర్వహణ, ప్రత్యేక ప్రవేశ నిబంధనలను తీసుకొచ్చింది.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది టీటీడీ. డిసెంబర్‌ 30 నుంచి 2026 జనవరి 8 వరకు ఆయా దర్శనాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. అయితే తొలి మూడు రోజులు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా దర్శనాలు కల్పించనుంది. ఆ తర్వాత వారం రోజులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2 ద్వారా సర్వ దర్శనాలు ఉంటాయని పేర్కొంది.

Advertisement

మొదటి మూడు రోజులు స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీవాణి దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్‌ ప్రముఖుల మినహా వీఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తేల్చి చెప్పింది. అలాగే వైకుంఠ ద్వార దర్శన రోజు డిసెంబర్‌ 30 నుంచి జనవరి 8 వరకు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపి వేస్తున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చింది.

తొలిమూడు రోజు డిప్ ద్వారా దర్శనాలు

తొలి మూడు రోజుల వైకుంఠ ద్వారా దర్శనాలకు నవంబర్‌ 27న అంటే గురువారం ఉదయం 10 గంటల నుండి డిసెంబర్‌ ఒకటి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్‌సైట్‌  https://ttdevasthanams.ap.gov.in, యాప్‌, వాట్సాప్, ఏపి గవర్నమెంట్‌ బాట్‌లో వంటి విభాగంలో ఎలక్ట్రానిక్‌ డిప్‌కు వివరాలు నమోదు చేసుకోవాలి. డిసెంబర్‌ రెండున మధ్యాహ్నం రెండు గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ వివరాలు టీటీడీ వెల్లడించనుంది.

ఇక జనవరి 6, 7, 8న స్థానికులకు వారి కోటా కింద దర్శనం కల్పిస్తారు. ప్రత్యేక అప్లికేషన్‌ ద్వారా దర్శన టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. వైకుంఠ ద్వార దర్శన సమయంలో రోజుకు ఐదు వేల టోకెన్లు స్థానికులకు కేటాయించనుంది. తిరుపతి, చంద్రగిరి , రేణిగుంట స్థానికులకు రోజుకు 4500 టోకెన్లు కేటాయించనుంది. తిరుమల స్థానికులకు రోజుకు 500 టోకెన్లు ఇవ్వనుంది.

ALSO READ: అన్నమయ్య జిల్లా కేంద్రంపై మంత్రి రాం ప్రసాద్ హాట్ కామెంట్స్

955023 00009 నెంబర్‌కు భక్తులు గోవిందా లేదా హాయ్‌ అని మొబైల్ ఫోన్‌లో మెసెజ్‌ పెట్టాలి. ఎంపిక చేసిన లాంగ్వేజ్‌లో టీటీడీ టెంపుల్‌ సర్వీస్‌ను ఎంపిక చేయాలి. ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనం-డిప్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి ఒకటి వరకు ఆయా తేదీలను ఎంపిక చేసి వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ చేయాలి.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×