E-Paper
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
Advertisement

CM Revanth Reddy: అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్య స్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆ దిశగా ఫారిన్ ఇన్వెస్టర్లలో విశ్వాసం కల్పించేలా రాష్ట్ర బ్రాండింగ్ ఉండాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న సమ్మిట్ బ్రాండింగ్ పై మంగళవారం తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

ఒక్కోరోజు ఒక్కో అంశంపై సీఎం సమీక్ష
వివిధ సంస్థలు రూపొందించిన ప్రచార చిత్రాలు, వీడియోలను పరిశీలించి.. వాటిలో పలు కీలక మార్పులను సూచించారు. ప్రచారంలో ప్రముఖులను హైలైట్ చేయాలి.. తెలంగాణ బ్రాండింగ్ అనేది కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. రాష్ట్ర గతం, వర్తమానం, భవిష్యత్తులను ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు. చరిత్ర, ప్రకృతి, పర్యావరణం, కళలతోపాటు ప్రముఖులను ప్రచారంలో వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement

నేటి నుంచి ఈనెల 30 వరకు సమావేశాలు..
గ్లోబల్ సమిట్ నేపథ్యంలో ఇవాల్టి నుంచి ఈనెల 30వరకు వివిధ శాఖల మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహించి.. ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నేడు లాజిస్టిక్స్, ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్కతో సీఎం భేటీ కానున్నారు. రేపు మౌలిక వసతులు, అభివృద్ధిపై మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సమీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ రైజింగ్ సమిట్‌పై సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం
నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విద్యాశాఖ, యువజన సంక్షేమంపై మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామితో.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు టూరిజంపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖతో సీఎం సమావేశమవుతారు. నవంబర్ 29 సాయంత్రం 4గంటలకు వ్యవసాయంపై మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరితో.. సాయంత్రం 6 గంటలకు సంక్షేమ విభాగాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, సీతక్క, అజారుద్దీన్‌తో రివ్యూ నిర్వహిస్తారు. చివరగా నవంబర్ 30న వైద్యారోగ్య రంగం ఏర్పాట్లపై మంత్రి దామోదర రాజనర్సింహతో సీఎం చర్చించనున్నారు.

Advertisement

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×