BigTV English

Tirumala: జులై కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. 18న విడుదల చేయనున్న టీటీడీ

Tirumala: జులై కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. 18న విడుదల చేయనున్న టీటీడీ

TTD Ticket Release : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవ టికెట్లు ఈ నెల 18 న టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు  అందుబాటులో ఉంటాయి. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం కానుంది. అంతేకాకుండా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లు ఈ నెల 22 మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.


23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను, అదే రోజున ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమలకు వచ్చే భక్తుల కోసం గదుల కోటాను ఏప్రిల్ 24న అందుబాటులో ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ టికెట్ల బుకింగ్ ప్రారంభం కానుంది.

ALSO READ: బిగ్ రిలీఫ్.. గాజుగ్లాసు జనసేనకే


రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24 వ తేదీ ఉదయం 10 గంటలక టీటీడీ విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా బుకింగ్ 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనుంది. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ టికెట్లను మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.

Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×