Big Stories

Siromundanam Case Verdict : తోట త్రిమూర్తులుకు షాక్.. శిరోముండనం కేసులో జైలు శిక్ష

Siromundanam Case Verdict today(Latest news in Andhra Pradesh) : 1996లో తూర్పు గోదావరి జిల్లాతో పాటు.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా సంచలనం రేపిన శిరోముండనం కేసులో.. విశాఖ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఊహించని షాక్ తగిలింది. ఆయనతో సహా 9 మంది నిందితులకు కోర్టు 18 నెలలు జైలుశిక్షతో పాటు.. రూ.2 లక్షలు జరిమానా విధించింది. 28 ఏళ్ల తర్వాత తీర్పు రావడంతో బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన.. వెంకటాయపాలెంలో 1996 డిసెంబరు 29న జరిగిన శిరోముండనం కేసులో విచారణ పూర్తి అయ్యింది. దీనిపై నేడు విశాఖ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును ఏప్రిల్ 12నే వెలువరించాల్సి ఉంది. కానీ.. అనూహ్యంగా తీర్పును వాయిదా వేశారు. రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండగా.. మరో 9 మంది నిందితులు కూడా ఉన్నారు. ప్రధాన సాక్షి కోటి రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ప్రధాన బాధితుడు కోటి చినరాజుకు ఆయన సోదరుడు. గత ఏడాది బాధితుడు పువ్వల వెంకటరమణ మృతి చెందాడు. మొత్తం ఐదుగురు బాధితుల్లో ఇద్దరు, 15 మంది సాక్షుల్లో మరో ఇద్దరు చనిపోయారు. 10 మంది నిందితుల్లో ఒకరు మరణించారు.

- Advertisement -

Also Read : సీఎం జగన్ పై దాడికేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నిందితుడు?

ఒక్కసారి కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన తోట త్రిమూర్తులుపై BSP పార్టీకి చెందిన కొందరు పోటీలో నిలవటం.. వారితో వాగ్వాదం, తోట వర్గీయులు రిగ్గింగ్ చేయడానికి దౌర్జన్యంగా పోలింగ్ బూత్ లోకి వచ్చారంటూ ప్రతి ఘటించటం జరిగింది. ఈ విషయంపై పోలింగ్ బూత్ వద్ద సుమారు గంటసేపు ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ విషయంపై తోట వర్గీయులు కక్ష పెట్టుకున్నారు.

తోట త్రిమూర్తులు ఎమ్మెల్యే గా గెలిచిన మూడు నెలలు తర్వాత.. తమకు ఎన్నికల్లో ఎదురు తిరిగిన ముగ్గురు వ్యక్తులు.. కోటి చిన్నరాజు, దడాల వెంకటరత్నం, చల్లపూడి పట్టాభి రామయ్యపై.. పొలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారంటూ తోట త్రిమూర్తులు అన్న కొడుకు తప్పుడు కేసు పెట్టారని బాధితులు పేర్కొన్నారు. 1996లో శిరోముండనానికి తోట వర్గీయులు పాల్పడ్డారు.

ఐదుగురు కుర్రాళ్లకు శిరోముండనం చేయవద్దని గ్రామస్థులు, వారి తల్లిదండ్రు కోరినా వినకుండా గుండు గీయించి, మీసాలు తీసి తర్వాత కనుబొమ్మలను కూడా తొలగించినట్లు కేసులో పేర్కొన్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. నాటి నుంచి న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నామని బాధితులు చెబుతున్నారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు బెంచ్.. నేడు తుదితీర్పు వెలువరిస్తామని చెప్పింది. సుమారు 28 సంవత్సరాల తర్వాత ఈ కేసులో బాధితులకు అనుకూలంగా కేసు రావడంతో.. హర్షం వ్యక్తమైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News