E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          
Advertisement

Karthika Deepam 2 serial today Episode: రోడ్డు మీద ఉన్న శివనారాయణ వాళ్లను కార్తీక్‌, దీప తమ ఇంటికి రమ్మని అడిగితే రామని చెప్తారు. అందుకు కార్తీక్‌ మీరు రాకపోతే మేము వెళ్లమని భీష్మిస్తాడు. దీప కూడా రమ్మని ప్రాదేయపడుతుంటే.. పారిజాతం కోపంగా ఆ దరిద్రుడు సూరజ్‌ను తీసుకొచ్చి మా నెత్తిన కూర్చెబెట్టారు. వాడు మమల్ని అధఃపాతాళంలోకి తొక్కేశాడు. దీనికంతటికి కారణం ఎవరు మీరు కదా..? ఇప్పుడు ఏమీ ఎరుగనట్టు వచ్చి మళ్లీ ఊరడింపు మాటలతో మమ్మల్ని ఇంటికి రమ్మని పిలుస్తున్నారు అంటే మేము మీ దయాదాక్షిణ్యాలతో బతకడానికే ఇదంతా ప్లాన్‌ చేశారా..? నేను ఎప్పుడో చెప్పాను.. దీప అడుగుపెట్టిన చోట గడ్డి  కూడా మొలవదని నా మాట ఎవ్వరూ వినలేదు. ఈమెను కంపెనీకి ఈసీవోను చేశారు.. కంపెనీ మన చేతుల్లోనే లేకుండా పోయింది.

ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారు మనకు ఇల్లే గతి లేకుండా పోయింది. అంటూ తిడుతుంది. కార్తీక్‌, దీప బాధగా మౌనంగా ఉంటారు. కార్తీక్‌ అందరినీ బతిమాలుతాడు. ఎవ్వరూ కూడా ఇంటికి రాలేమని చెప్తారు. ఇక కార్తీక్‌ బాధగా శివనారాయణతో నువ్వు వస్తేనే వీళ్లంతా వస్తారు తాత ఫ్లీజ్‌ తాత రా తాత.. మీ కోసం అక్కడ మా అమ్మ భోజనం చేయకుండా ఏడుస్తూ కూర్చుంది అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే.. శివనారాయణ రాలేమని చెప్తాడు. మీ అమ్మ అడిగితే.. శివనారాయణ కుటుంబం చచ్చిపోయింది అని చెప్పు ఎలా చచ్చిపోయింది అని అడిగితే.. నువ్వు, దీప కలిసి చంపేశారని చెప్పు అంటాడు. ఇక అందరూ అక్కడి నుంచి పక్కనే ఉన్న గుడిలోకి వెళ్తారు.

Advertisement

గుడిలోకి వెళ్లి అక్కడి పంతులును రాత్రికి ఇక్కడే గుడిలో పడుకోవచ్చా అని అడిగితే.. రాత్రి పూట ఇక్కడ ఎవ్వర ఉండకూడదని పంతులు చెప్తాడు. అప్పుడే పారిజాతం తాము ఒక రాత్రి గుడిలో నిద్ర చేస్తామనే మొక్కు ఉందని అందుకే వచ్చామని చెబితే అలాంటి అచారం ఇక్కడ ఏం లేదని వెళ్లిపోమ్మని చెప్తాడు. ఆ మాటలకు దశరథ, శివనారాయణ బాధపడుతుంటారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్లాలండి.. అసలే జ్యోత్స్న, సుమిత్ర ఇబ్బంది పడుతున్నారు.. ఇక నడవలేరు అని చెప్పగానే.. నడవడం కాదు అసలు ఇలాంటి బతుకే ఎప్పుడూ బతకలేదు అంటాడు దశరథ. పారు తనకు కడుపులో నొప్పిగా ఉందని అంటే.. అది ఆకలి నొప్పి పిన్ని అంటూ చెప్తాడు దశరథ.  

కార్తీక్‌, దీప ఇద్దరూ శివనారాయణ వాళ్ల ఆకలి తీర్చేందుకు ఒక ప్లాన్‌ ఆలోచిస్తారు. వెంటనే కార్తీక్‌ బయటకు వెళ్లి స్వీట్లు పులిహోర లాంటివి తీసుకొస్తాడు. దీప, కార్తీక్ ఇద్దరూ పంతులు దగ్గరకు వెళ్లి ఇంట్లో పూజ చేశామని ప్రసాదం పంచుదామని వస్తే ఇక్కడ ఎవ్వరూ లేరని ఎవరైనా ఉంటే పంచమని పంతులుకు ఇస్తారు. పంతులు అలాగేనని తీసుకుని వెళ్లి శివనారాయణ వాళ్లకు ఆ ప్రసాదం ఇస్తాడు. అవి తీసుకున్న వాళ్లు తింటారు. కార్తీక్‌, దీప ఇద్దరు తెలియనట్టు వాళ్లు ఎవరండి అని అడిగితే.. ఎవరో దేవుడి సన్నిధిలో నిద్ర చేయడానికి వచ్చారట.. కానీ ఇక్కడ ఉండకూడదని చెప్పినా వినడం లేదు అంటాడు పంతులు. కార్తీక్‌, దీప తమ మాటలతో పంతులును కన్వీన్స్‌ చేసి శివనారాయణ వాళ్లు రాత్రికి గుడిలో ఉండేలా ఒప్పిస్తారు. పంతులు వెళ్లి వాళ్లకు రాత్రికి గుడిలోనే పడుకోమని చెప్తాడు.

Advertisement

మరుసటి రోజు ఉదయమే మళ్లీ ప్రసాదం తీసుకుని వచ్చి పంతులుకు ఇస్తారు కార్తీక్‌, దీప. అప్పుడే ఆలయ ధర్మకర్త వచ్చి శివనారాయణ వాళ్లను చూసి అనుమానిస్తాడు. దొంగతనం చేయడానికి ఇలా వచ్చారేమో అంటూ అవమానకరంగా మాట్లాడతాడు. గుడిలో అమ్మవారి నగలు కరెక్టుగా ఉన్నాయో లేదో చూడమని పంతులుకు చెప్తాడు. శివనారాయణ వాళ్లను దొంగలుగా ట్రీట్‌ చేస్తాడు ఆ వ్యక్తి. పారిజాతం కోపంగా తామెవరో చెప్పబోతుంటే.. వద్దని శివనారాయణ ఆపేస్తాడు. మీలాంటి వాళ్లకు ధర్మసత్రాలు ఉంటాయని.. వెళ్లి అక్కడ ఉండమని చెప్తాడు ఆ వ్యక్తి. బాధగా అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు. జ్యోత్స్నకు తల తిరుగుతున్నట్టు అయితే టాప్‌ దగ్గరకు వెళ్లి ముఖం కడుగుతుంది. తిరిగి చూస్తూ ఎదరుగా సూరజ్‌ కనిపిస్తాడు. కోపంగా వెళ్లి ఎందుకు వచ్చావురా మేము చస్తూ ఎలా బతుకుతున్నామో చూసి నవ్వుకోవడానికి వచ్చావా..? అంటుంది. సూరజ్‌ మౌనంగా చూస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Karthika Deepam 2 Serial Today Episode September 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో దీప – ఇంట్లోంచి గెంటివేయబడ్డ శివనారాయణ          

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

Big Stories

Advertisement
×