Gundeninda Gudigantalu Meena : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న మోస్ట్ వాంటెడ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి.. ప్రముఖ తెలుగు చానల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ గురించి ఎంత చెప్పుతున్నా కూడా ఏదో మిగిలి ఉంటుంది. మధ్యతరగతి కుటుంబంలోని మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలతో పాటుగా అసూయలు ఉంటే ఎలా ఉంటుందో అన్నది ఈ సీరియల్స్ స్టోరీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. డబ్బు ఆశ ఎవరినైనా మార్చేస్తుంది అని చెప్పడానికి ఈ సీరియల్ ఉదాహరణగా చెప్పొచ్చు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈ సీరియల్ కాస్త డౌన్ అయ్యి మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో నటిస్తున్న యాక్టర్స్ గురించి అందరికీ తెలుసు ముఖ్యంగా హీరో హీరోయిన్లయినా బాలు మీనలా గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది.. తాజాగా మీనా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మీనా నెలకు ఎంత సంపాదిస్తుందో అన్నది ఇప్పుడు హాట్ చర్చగా మారింది.. మరి మీనా నెలకు ఎన్ని లక్షల సంపాదిస్తుంది అన్నది ఒకసారి మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
బుల్లితెర అభిమానులకు మీనా గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు.. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న మేన అందరికీ సుపరిచితురాలు. గతంలో ఈమె కార్తీకదీపం సీరియల్ లో రౌడీ పాత్రలో కనిపించి తన నటనతో అందరిని మెప్పించింది. పేరుకే కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ కానీ తెలుగు అమ్మాయిలాగా అందరి మనసును దోచుకుంది. ఈమె సీరియల్స్ తో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఈమె సీరియల్ లో పద్ధతిగా కనిపించిన కూడా బయట మాత్రం చాలా హాట్ లుక్ లో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది. అదే ఈమె షేర్ చేసే ఫోటోలకి ఫాన్స్ ఫీదా అవుతూ ఉంటారు. హీరోయిన్ ను మించిన అందంతో తన లేలేత అందాలతో కుర్ర గారికి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ అమ్మడు ఎలాంటి ఫోటోలు పెట్టినా కూడా క్షణాల్లోనే వైరల్ అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఈమె సోషల్ మీడియా ద్వారా దాదాపు 14 లక్షల వరకు నెలకు సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే చర్చనీయాంశంగా మారింది. ఈ అమౌంట్ పై ఏదైనా క్లారిటీ రావాలి అంటే మీనా స్పందించేంత వరకు వెయిట్ చేయాల్సిందే..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోయిన్గా నటిస్తున్న మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. కన్నడ అమ్మాయి అయినా కూడా తెలుగమ్మాయిలాగా పద్ధతిగా సీరియల్స్లలో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నడిగా చెరగని ముద్ర వేసుకుంది. నేను అసలు పేరు అమూల్య గౌడ. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరసగా సీరియల్స్ చేసుకొని బిజీగా మారుతుంది. కేవలం స్టార్ మా లో మాత్రమే కాదు మిగతా చానల్స్లలో కూడా సీరియల్స్ అవకాశాలు రావడంతో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారే ప్రయత్నాలు చేస్తుంది. అటు కన్నడలో కూడా సీరియల్స్ చేస్తూ బాగా బిజీగా ఉంది.. సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటూ అందరినీ తన అందాలతో ఆకట్టుకుంటుంది. నెక్స్ట్ ఎలాంటి స్టోరీ తో సీరియల్స్ చేస్తుందో చూడాలి..