Abhishek Sharma father Rajkumar Sharma On Celebration: టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మూడు టీ20 ల సిరీస్ నిన్నటితో ముగిసింది. మూడింటిలో వరుసగా గెలిచిన టీమిండియా…3-0 తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును వైట్ వాష్ చేసింది. అయితే నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన మూడవ టి20 సందర్భంగా అభిషేక్ శర్మ 30 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ శర్మ, ఓం నమః శివాయ అంటూ మైదానంలోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
సెంచరీ పూర్తి చేసిన తర్వాత అభిషేక్ శర్మ చేసిన సెలబ్రేషన్స్ పై తాజాగా ఆయన తండ్రి రాజ్ కుమార్ శర్మ స్పందించారు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… అభిషేక్ శర్మ సెంచరీకి ఆ శివుడే కారణం అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిరోజు ఓం నమః శివాయ అంటూ జపం చేస్తాడని గుర్తు చేశారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తాడని వివరించారు రాజ్ కుమార్ శర్మ. దేవగానే ఎక్కువసేపు ధ్యానం పైన దృష్టి సారిస్తాడని వెల్లడించారు. ఆ శివయ్యను ప్రతి రోజు పూజిస్తాడని స్పష్టం చేశారు. అభిషేక్ శర్మ కెరీర్ లో ఉన్న మంచి లక్షణం ఇది ఒక్కటే అంటూ వ్యాఖ్యానించారు.
పొద్దున స్నానం చేసిన నేపథ్యంలో అభిషేక్ శర్మ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని… అదే ఊపుతూ మైదానంలో కూడా ప్రాక్టీస్ చేస్తాడని వివరించారు. ప్రతిరోజు ధ్యానం చేసి, ఏకాగ్రత పెంచుకున్నాడని స్పష్టం చేశారు అభిషేక్ శర్మ తండ్రి రాజ్ కుమార్ శర్మ. సెంచరీ చేసిన అభిషేక్ శర్మను ప్రశంసిస్తూ… ఇలాంటి రికార్డులు మరెన్నో సాధించాలని కోరారు. సెంచరీ చేసిన తర్వాత మైదానంలోనే ఓం నమః శివాయ జపం చేయడం తనకు నచ్చిందని వెల్లడించారు. ఇదే ఊపుతో అభిషేక్ శర్మ ముందుకు సాగాలని కోరారు. దానికి తగ్గట్టుగానే యువరాజు సింగ్ కూడా తన కొడుకుకు మంచి ట్రైనింగ్ ఇస్తున్నాడని ప్రశంసించారు. యువరాజ్ సింగ్ లాంటి కోచి దొరకడం తమ అదృష్టం అన్నారు.
టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ సెలబ్రేషన్స్ పై ఇండియన్ ఫ్యాన్స్ ఖుషి అవుతుంటే.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మైదానంలో హిందూ మతానికి సంబంధించిన సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ పై పర్మినెంట్ బ్యాన్ విధించాలని కోరుతున్నారు.