E-Paper
Advertisement

Podarillu Today Episode : మాధవ్, మనీష పెళ్లి ఫిక్స్.. శైలుకు వార్నింగ్.. మాధవ్ పై అనుమానం..

Podarillu Today Episode : మాధవ్, మనీష పెళ్లి ఫిక్స్.. శైలుకు వార్నింగ్.. మాధవ్ పై అనుమానం..
Advertisement

Podarillu Today Episode September 18th :చక్రి వాళ్ళందరూ గదిలో సంతోషంగా ఉండగా అప్పుడే లోపలికి జయంతి పాత మొగుడు శేఖర్ వస్తాడు. తమ్ముడు నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడువి అంటూ చాలా సంతోషంగా చెప్తాడు. అసలు ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి చక్రీ ఏం చేశాడు అని శేఖర్ ని అందరూ అడుగుతారు.. శేఖరు జయంతిని ఎలా ఒప్పించాడు అని చెప్పమని అందరూ అడుగుతారు.. శేఖర్ చెప్పిన మాట విని అందరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు.. జయంతి కాళ్లు పట్టుకున్న తర్వాతే తను రియలైజ్ అయిందని అనుకుంటారు.. జయంతి మనసు కరిగిపోవడానికి కారణం చక్రినే అతను చెప్పినట్టే నేను చేశాను.. దేవుడిచ్చిన తమ్ముడు అంటూ శేఖర్ చక్రిని సెగ పొగిడేస్తూ ఉంటాడు.. మొత్తానికి చక్రి అనుకున్న ప్లాన్ ప్రకారం పెళ్లి సంబంధం క్యాన్సల్ అవ్వడం అందరూ చక్రిని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటారు.

అయ్యో.. మాధవ్

ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాధవ సంబంధం చెడిపోయిందని చాలా సంతోషంగా ఉంటారు కానీ… మాధవ్ తన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోవడానికి ఈ కారణం చక్రిని చాలా కోపంగా ఉంటాడు. అయితే ఈ పెళ్లి సంబంధం చెడిపోవడానికి కారణం నేనే అన్నయ్య.. జయంతి మన ఇంటికి రావడం ఇష్టం లేకే నేను ఇదంతా చేశాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చక్రి అనగానే ఎందుకురా నేను నా సంతోషం కోసం ఇదంతా చేశానా నా తర్వాత మీ అందరికీ పెళ్లిళ్లు కావాలనే కదా ఇదంతా చేశాను. మీరు ఎప్పటికీ ఇలానే ఉండిపోతారా నాకు నచ్చినట్టు నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను తప్ప నా సుఖాన్ని నేను ఏ రోజు చూసుకోలేదు అని మాధవ్ అంటాడు.. ఆ మాట వినగానే మిగిలిన వాళ్ళందరూ చాలా ఫీల్ అవుతారు. ఇక అటు శైలు కేశవ తో గొడవ పడిందని ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు కానీ శైలు మాత్రం వరాలకి షాకిచ్చేలా మాట్లాడుతుంది.

మాధవ్ ఫుల్ హ్యాపీ..

Advertisement

మాధవ్ బన్సీ దగ్గరికి వెళ్లి తన ఎంగేజ్మెంట్ చెడిపోయింది అని బాధపడిపోతూ ఉంటాడు. నేను పెళ్లి చేసుకుని ఉంటే నా తర్వాత నా తమ్ముళ్లకు కూడా పెళ్లి అయ్యేది కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించలేదు కాబట్టి నాకు చాలా బాధగా ఉంది బంసి ఇక మీదట నాకు పెళ్లి అవుతుందో లేదో అని బాధ పడిపోతూ ఉంటాడు. మీరు అలా బాధపడకండి బాయ్ ఈ పెళ్లి సంబంధం చెడిపోవడం కూడా చాలా మంచిదే మీకు మంచి అమ్మాయి రాసిపెట్టి ఉందేమో అని అంటాడు. నేను పెళ్లి చేసుకుంటేనే కేశవ పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టాడు ఇప్పట్లో నా పెళ్లయి ఎలా లేదు పాపం వాళ్ళని కూడా నేను బాధ పట్టేలా ఉన్నాను అని బాధ పడిపోతూ ఉంటాడు.. మనీషాని చూసిన బన్సీ మాధవ్ ని ఇష్టపడుతుంది అని అనుకుంటాడు. ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని కలపాలి అని అనుకుంటాడు.

మనీషాను పెళ్లి చేసుకుంటారా..?

నా పెళ్లి జీవితంలో అవుతుందో లేదో అని నాకు చాలా బాధగా ఉంది. అసలు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటానని నేను ఎప్పుడు ఊహించలేదు అని బాధపడుతున్న మాధవ్ను ఇప్పుడు ఈ మాట అడగచ్చు లేదో నాకు అర్థం కావట్లేదు బాయ్ అని బన్సి అంటాడు.. ఏం మాట్లాడుతున్నావ్ బంసి ఏమైంది దేని గురించి నువ్వు అడగాలి అనుకుంటున్నావు అని బాధ అడుగుతాడు. నా చెల్లెలు మనిషాన్ని మీరు పెళ్లి చేసుకుంటారా అని అతను అడగగానే మాధవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మా చెల్లికి మంచి జీవితం ఇవ్వాలని ఇక్కడికి తీసుకొని వచ్చాను మీలాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తను చాలా సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకుంటుంది అని చెప్పగానే ఒక్కసారిగా మాధవ్ షాక్ అయినా కూడా ఆనందంలో ఉండిపోతాడు. అయితే నా ఇష్టం గురించి కాదు ముందు తనకి ఇష్టము కాదు తెలుసుకోవాలి కదా అని మాధవ్ అనగానే తనకి ఇష్టం అన్న సంగతి నాకు బాగా తెలుసు. తను కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది అని బంసి అంటాడు. మాట వినగానే మాధవ్ చాలా సంతోషంగా ఉంటాడు.

శైలుకు వార్నింగ్..

Advertisement

శైలు వల్లే ఇదంతా జరిగింది మా అన్నయ్య బాధపడడానికి కారణం శైలు లేని కేశవ చాలా కోపంగా ఉంటాడు. అసలు మా అన్నయ్య పెళ్లి గురించి మేము ఎప్పుడు బాధపడలేదు కానీ తనవలేదు అంతా జరిగింది అని శైలు పై సీరియస్ గా ఉంటాడు కేశవ అప్పుడే శైలు ఫోన్లు మీద ఫోన్లు చేస్తుంది కానీ తను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు ఆఖరికి ఫోన్ లిఫ్ట్ చేసి తన స్వార్థం గురించి చూసుకున్నాను అన్నట్లుగా మాట్లాడడంతో కేశవ సీరియస్ అవుతాడు. తన పెళ్లి అయితే మన పెళ్లి అవుతుంది అని ఆశపడ్డాను అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో నేను ఏమి చెప్పలేదు అని శైలు ఎంత చెప్తున్నా సరే కేశవ మాత్రం వినకుండా నీతో మాట్లాడాలంటే నాకు అసహ్యం వేస్తుంది అని ఫోన్ పెట్టేస్తాడు దాంతో శైలు చాలా ఫీల్ అవుతుంది.

మాధవ్ పై డౌట్..

పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందని మాధవి ఎక్కడికో వెళ్లిపోయాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే ఎక్కడ కనిపించలేదు అని కేశవ్ అనడంతో ఇక ఎక్కడికి వెళ్లాడో వస్తాడులే అని వెయిట్ చేస్తూ ఉంటారు. మాధవ్ బాధపడిపోతూ ఉంటాడు అని అందరూ అనుకుంటారు కానీ దానికి వ్యతిరేకంగా తను చాలా సంతోషంగా ఇంట్లోకి వస్తాడు అయితే ఎవ్వరు ఏం పిలిచినా కూడా అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో మహాలక్ష్మి ఏంటి పెద్ద పిలుస్తున్న కూడా అసలు మాట్లాడటం లేదు అని అడుగుతుంది. పిలిచారా అమ్మ నాకు వినిపించలేదు అని మాధవ్ అంటాడు అయితే పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందని అన్నయ్యకి పిచ్చి ఏమైనా పట్టిందా ఇంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. మాధవ్ మాత్రం మనిషాన్ని తలుచుకుంటూ సంతోషంగా ఉంటాడు. అన్నయ్య బయటకు వెళ్లిన తర్వాత ఏదో జరిగింది. అందుకే తను ఇలా పిచ్చోడిలాగా ప్రవర్తిస్తున్నాడు అని అందరికీ అనుమానం వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. వల్లి ఫుల్ హ్యాపీ.. పోలీస్ స్టేషన్ లో రచ్చ రచ్చ..

Related News

Ninnu kori Serial Today Episode September 18th ‘నిన్ను కోరి’ సీరియల్‌: దాక్షాయణి ఇంట్లోకి కేర్ టేకర్లుగా వెళ్లిన చంద్ర, మదన్   

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. వల్లి ఫుల్ హ్యాపీ.. పోలీస్ స్టేషన్ లో రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: అవని ప్లాన్ సక్సెస్.. హమ్మయ్య పార్వతి హ్యాపీ.. కమల్ ను రెచ్చగొట్టిన పల్లవి..

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే .. టీవీల్లోకి హిట్ సినిమాలు…

బిగ్ బాస్ హౌస్ లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన చరణ్… షాలినికి బిగ్ సర్ప్రైజ్!

బిగ్ బాస్ హౌస్ లో శవపేటికలు, అస్తిపంజరాలు.. అసలేం జరుగుతోంది భయ్యా!

గెటప్ శ్రీను రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోలను మించిపోయాడుగా?

Big Stories

Advertisement
×