BigTV English

Tirupathi Medical College: మెడికల్ కాలేజీ హాస్టల్లో డ్రగ్స్, వ్యభిచారం.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా SV మెడికల్ కాలేజ్

Tirupathi Medical College: మెడికల్ కాలేజీ హాస్టల్లో డ్రగ్స్, వ్యభిచారం.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా SV మెడికల్ కాలేజ్
Andhra pradesh today news

Unscrupulous Activities in Sri Venkateswara Medical College in Tirupathi: తిరుపతి ఎస్‌.వీ మెడికల్‌ కాలేజీ బాయ్స్‌ హాస్టల్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది . పోలీసుల తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే చిత్రాలు బయటపడుతున్నాయి. క్యాంపస్‌లో విచ్చలవిడిగా మత్తుపదార్థాల వినియోగం జరుగుతున్నట్లు తేలింది.దీంతో పాటు విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుండటంతో హాస్టల్‌ పరిసరాల్లో కండోమ్‌ ప్యాకెట్లు ప్రత్యక్షమయ్యాయి. చదువుల నిలయంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాన్ని కొందరు విద్యార్థులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు.


రెండు రోజుల క్రితం శ్రీవెంకటేశ్వర మెడికల్‌ కాలేజీ బాయ్స్‌ హాస్టల్‌లో ర్యాగింగ్‌ పేరుతో విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. అనంతరం ఓ యువతి విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇచ్చినా వారి తీరు మాత్రం మారలేదు. గతంలో కూడా ఇలాంటి ఘటనే జరగడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read More: బర్డ్ ఫ్లూ నియంత్రణపై ఫోకస్.. మూడ్రోజులు చికెన్ షాపులు బంద్


విశ్వవిద్యాలయం ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బాయ్స్‌ హాస్టల్‌ పరిసరాల్లో తుప్పలను తొలగిస్తుండగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో వెదురు మొక్కలు గుబురుగా పెరగడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారుచేసి, వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు సైతం ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకు ఇస్తూ, కండోమ్‌లు సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

యువతీ యువకులు అక్కడకు వచ్చి మత్తుమందులు సేవిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని శుభ్రం చేస్తుండగా.. వందల సంఖ్యలో మద్యం సీసాలు, కండోమ్‌ ప్యాకెట్లు కనిపించాయి. చెట్లపై వ్యభిచారం కోసం ఏర్పాటు చేసిన పడకలు ఉన్నాయి. క్యాంప్‌సలోకి గుర్తింపు కార్డు లేకుండా ఎవరైనా వస్తే వెనక్కి పంపించేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది హాస్టల్‌ పరిసరాలను మాత్రం పట్టించుకోవడం మానేశారు. దీంతో ఆ పరిసరాలన్నీ అసాంఘిక వ్యవహారాలకు అడ్డాగా మారిపోయాయి.

ఈ వ్యవహారంతో నివ్వెరపోయిన విశ్వవిద్యాలయ అధికారులు.. వెస్ట్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం తనిఖీలు చేపట్టిన పోలీసులు వందలాది మద్యం బాటిళ్లు, కండోమ్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికైనా పటిష్ట భద్రత ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Tags

Related News

Pulivendula Victory: జగన్‌కు మరిన్ని షాకులు.. పులివెందుల విక్టరీపై సీఎం చంద్రబాబు రియాక్షన్

AP Free Bus Scheme: రేపటి నుంచి ఏపీ మహిళలకు ఫ్రీ బస్సు.. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

Pulivendula: పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలు.. లతా రెడ్డి ఘన విజయం, డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద.. డేంజర్‌లో విజయవాడ

AI In Tirumala: ఆగమ శాస్త్రానికి విరుద్ధం.? కొండపై AI తో లాభమా.? నష్టమా.?

AP Politics: కాంగ్రెస్ నుంచి జగన్‌కు సంకేతాలు.. షర్మిలతో చేయి కలుపుతారా? ఏపీలో హాట్‌గా చర్చ

Big Stories

×