BigTV English

5 Super Bikes Under Rs 1 Lakh: ఈ 5 బైక్స్ సూపరో సూపర్.. మైలేజ్ ఎక్కువ.. ధర రూ. లక్ష లోపే!

5 Super Bikes Under Rs 1 Lakh: ఈ 5 బైక్స్ సూపరో సూపర్.. మైలేజ్ ఎక్కువ.. ధర రూ. లక్ష లోపే!

5 Super Bikes Under Rs 1 Lakh: ప్రస్తుతం టూ వీలర్ల వినియోగం బాగా పెరిగిపోయింది. రకరకాల మోడళ్లు మార్కెట్‌లోకి రావడంతో వాహన ప్రియులు వాటికి ఆకర్షితులవుతున్నారు. ప్రముఖ కంపెనీలు అప్‌డేటెడ్ వెర్షన్లతో యువతను ఆకట్టుకుంటున్నాయి. అయితే వాటి ధరలు కూడా భారీ స్థాయిలో ఉండటంతో కొనేందుకు కొందరు వెనక్కి తగ్గుతున్నారు.


అయితే తక్కువ ధరలో, ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్‌లను వెతుకుతున్నట్లయితే ఇక్కడ అద్భుతమైన టూ వీలర్స్ ఉన్నాయి. అవేంటో చూసేంద్దాం. కేవలం రూ.1 లక్షలోపు టాప్ 5 బైక్‌లు ఇక్కడ ఉన్నాయి. మైలేజ్, ఇంజన్ పరంగా కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తాయి.

Honda Shine SP 125:


హూండా షైనీ ఎస్‌పి 125 బైక్ 124cc ఇంజన్ సామర్థ్యంతో వస్తుంది. లీటర్‌ పెట్రోల్‌కి ఈ బైక్ 60 కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. అయితే ఈ బైక్ ధర రూ.1 లక్షకు అందుబాటులో ఉంటుంది.

Read More: ‘ఎంఎక్స్ మోటో ఎం 16’ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. లుక్ అదిరింది.. ధర చాలా తక్కువ గురూ!

Hero Xtreme 125R:

హీరో ఎక్స్‌ట్రిమ్ 125 ఆర్ బైక్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. కొత్తగా విడుదలైన ఈ 125 సిసి బైక్ లుక్, డిజైన్‌కు మంచి ప్రజాదరణ పొందింది. దీని ధర రూ.1 లక్ష కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

Bajaj Pulsar 125:

బజాజ్ పల్సర్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఇందులోని పల్సర్ 125 బైక్‌ను మంచి ధరతో కొనుక్కోవచ్చు. ఇది 124 సిసి ఇంజన్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కి 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. డిస్క్ బ్రేక్‌‌ను కూడా ఈ బైక్ కలిగి ఉంది. దీని ధర రూ.1 లక్షలోపు ఉంటుంది.

TVS Raider 125:

టీవీఎస్‌కు మార్కెట్‌లో మంచి పేరు ఉంది. వాహనప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త మోడళ్లను ఈ కంపెనీ తీసుకువస్తుంది. ఇటీవల టీవీఎస్ రైడర్ 125 పేరుతో మార్కెట్‌లోకి మరొక కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ బైక్ తన లుక్, డిజైన్, కలర్‌తో వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇది 125 సిసి ఇంజన్ సామర్థ్యంతో వస్తుంది. ఒక లీటర్ పెట్రోల్‌తో ఈ బైక్ 50 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అయితే దీని ధర రూ.1 లక్ష కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది.

Read More: హీరో మోటోకార్ప్ నుంచి మరో స్టైలిష్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే..?

Bajaj Platina 100:

బజాజ్ ప్లాటినా 100 బైక్ 102 సిసి ఇంజన్ సామర్థ్యంతో వస్తుంది. ఈ బైక్‌ను మైలేజ్ రారాజుగా పిలుస్తారు!. ఇది లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.90 వేల వరకు ఉంటుంది.

Tags

Related News

iOS 26 Battery drain: ఐఫోన్ లో కొత్తగా బ్యాటరీ సమస్యలు.. కారణం ఇదే

iPhone 17 sales: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్లు.. అయినా వెనక్కు తగ్గని ఐఫోన్ 16

Flipkart Big Billion Days: ఫ్లిప్ కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ 2025.. ఈ ఫోన్లు అసలు కొనకూడదు

No Cost EMI: నో-కాస్ట్ ఈఎంఐల పేరుతో దోపిడీ.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ షాపింగ్ సమయంలో జాగ్రత్త!

Seedream 4.0: నానో బనానాకు సవాల్.. కొత్త ఫోటో ఏఐ లాంచ్ చేసిన టిక్ టాక్ కంపెనీ

JioFind Tracker: విలువైన వస్తువులు పోగొట్టుకున్నారా?.. భయపడొద్దు జియో ట్రాకర్ కనిపెట్టేస్తుంది!

Smartphone Comparison: ఒప్పో F31 vs వివో Y31.. పోటాపోటీగా విడుదలైన రెండు కొత్త ఫోన్లు.. ఏది బెటర్?

Strange Things: కారు నుంచి బూడిద వరకు.. పరిశోధకులు అంతరిక్షంలో వదిలిన 6 వింత వస్తువులు!

Big Stories

×