E-Paper
Advertisement

AP: జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టిన చీర.. ఆలయంలో కొట్లాట

AP: జనసేన నేతల మధ్య చిచ్చు పెట్టిన చీర.. ఆలయంలో కొట్లాట
Advertisement

AP: జనసేన నేతల మధ్య ఓ చీర చిచ్చు పెట్టింది. నాదంటే.. నాదంటూ.. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. చివరికి కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన విజయవాడ కనకదుర్గమ్య ఆలయంలో చోటుచేసుకుంది.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ గతంతో బెజవాడ కనక దుర్గమ్మను దర్శించుకొని పట్టుచీర సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ చీరను దేవాలయ కాంట్రాక్టర్లు అమ్మకానికి పెట్టారు. ఈక్రమంలో నిర్వహించిన వేలంలో జనసేన నేత స్వరూప రూ. 8 వేలకు చీరను దక్కించుకున్నారు. అనంతరం బిల్లింగ్ జరుగుతుండగా జనసేనాని పోతిన మహేష్ అనూహ్యంగా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. చీర తనకే ఇవ్వాలంటూ ఆలయ కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేశారు.

Advertisement

దీంతో ఆలయ కాంట్రాక్టర్ స్వరూప వద్ద నుంచి చీరను తిరిగి తీసుకున్నాడు. తనకు ఇవ్వలేనని తేల్చి చెప్పాడు. దీంతో వివాదం చోటుచేసుకుంది. తాను వేలంలో గెలుచుకున్న చీరను.. చివరి నిమిషంలో తనకు ఎందుకివ్వరని స్వరూప ప్రశ్నించారు. ఆ సమయంలో ఆలయానికి చేరుకున్న పోతిన మహేష్, స్వరూపల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల యుద్ధం జరిగింది. చివరికి స్వరూప అలిగి ఆలయం నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమైంది.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×