BigTV English

American Scientists:అమెరికాను తాకిన గ్రహంతరవాసుల కదలికలు..!

American Scientists:అమెరికాను తాకిన గ్రహంతరవాసుల కదలికలు..!

American Scientists:అసలు గ్రహంతర వాసులు ఉన్నాయా లేదా అన్న పరిశోధనలు ఎప్పటికీ ఒక కరెక్ట్ సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇప్పటికీ కనిపెట్టలేని దూరం నుండి భూమిపైకి పలు రేడియో సిగ్నల్స్ అందాయి. అవి గ్రహంతరవాసుల నుండి వచ్చే సిగ్నల్సే అని శాస్త్రవేత్తలకు అనుమానం ఉన్నా.. అది నిజమే అని నిర్ధారణకు మాత్రం రాలేకపోయారు. తాజాగా అమెరికాలో గ్రహంతరవాసులే అని చెప్పే ఆనవాళ్లు కనిపించినట్టుగా తెలుస్తోంది.


గత మూడు రోజులుగా అమెరికా గగనతలంలో గుర్తుతెలియని ఒక వస్తువు సంచరిస్తూ కనిపించింది. అది ఏంటో శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కలేదు. అందుకే దానిని ఎఫ్ 16 యుద్ధవిమాన సాయంతో మిచిగాన్‌లోని హ్యూరన్ సరస్సులో కూల్చేశారు. త్వరలోనే ఆ వస్తువును బయటకు తీసి దానిపై పరిశోధనలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారికంగా ప్రకటించింది.

కొన్నిరోజుల క్రితం చైనా.. అమెరికాపై నిఘా పెట్టడం కోసం స్పై బెలూన్‌ను గాలిలో పంపింది. చైనా అదంతా అబద్ధమని ఖండించినా కూడా.. అమెరికా మాత్రం దానిని సముద్రంలో పడేసింది. ఇప్పుడు ఇలాంటి ఒక అంతుచిక్కని వస్తువు కూడా తమపై స్పై చేయడానికే వచ్చుంటుందేమో అన్న అనుమానాలు వారిలో మొదలయ్యాయి. మరోవైపు శాస్త్రవేత్తలు మాత్రం ఇవి గ్రహంతరవాసుల కదలికలు కూడా కావచ్చని అనుమానిస్తున్నారు.


గ్రహంతరవాసుల కదలికలను పూర్తిగా ఖండించలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే అమెరికా ఆకాశంలో ఎగిరిన వస్తువుల గురించి ప్రతీ కోణంలో ఆలోచిస్తున్నామని యూఎస్ ఎయిర్‌‌ఫోర్స్ తెలిపింది. వాటిపై పరిశోధనలు మొదలుపెట్టిన తర్వాత ఆ వస్తువుల గురించి మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని అమెరికా ప్రజలు భావిస్తున్నారు. అంతే కాకుండా సముద్రంలో కూల్చిన ఆ వస్తువు వల్ల ఎవరికీ ఏ ప్రమాదం జరగకుండా ఉండేలా చూసుకుంటున్నామని అమెరికా ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×