E-Paper
Advertisement

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ  సిటీలో ఘటన
Advertisement

Visakhapatnam: చాలామంది చేతిలో డబ్బులు ఉండగా ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. రేపటికి పని కొస్తాయంటూ పొదుపు మంత్రం పాటిస్తుంటారు. ఒక్కోసారి వాటిని మరిచిపోతారు. ఫలితంగా ఆ డబ్బులు ఎందుకు పని చేయకుండా ఐపోతాయి. అలాంటి ఘటన విశాఖ సిటీ నడిబొడ్డున బయటపడింది. అసలు ఏం జరిగింది?

విశాఖ సిటీ నడిబొడ్డున నోట్ల కుప్ప

విశాఖపట్నం సిటీలోని సెంట్రల్‌ పార్క్‌ సమీపంలో కరెన్సీ నోట్ల కుప్ప తీవ్ర కలకలం రేపింది. పార్క్‌కు ఎదురుగా వున్న ఓ చోట పెద్ద సంఖ్యలో నోట్లు పడి ఉన్నాయి. మార్నింగ్‌ వాకర్స్‌ వాటిని గుర్తించారు. అందులో రూ.10 మొదలు రూ.500 వరకు నోట్లు ఉన్నాయి. నోట్లతోపాటు ఎల్‌ఐసీ రసీదులు, ఓ మహిళకు సంబంధించిన పాన్‌ కార్డు ఉన్నాయి. వెంటనే మార్నింగ్‌ వాకర్స్‌ దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, చిరిగిన లేదంటే ఎలుకలు కొట్టేసిన నోట్లను పరిశీలించారు.

వాటిని చూసి షాకైన మార్నింగ్ వాకర్స్

Advertisement

ఆ నోట్లను ఎవరు ఇక్కడ పడేశారు? అన్నకోణంలో ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారు. పాన్‌ కార్డు, ఇతర ఆధారాలతో ఆ నోట్ల సంబంధించిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు పూర్తయితే నోట్ల వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కరెన్సీ నోట్ల పక్కన ఎల్ఐసీ కట్టిన రసీదులు, ఓ మహిళ పాన్ కార్డు లభించడంతో ఏదైనా నేరానికి సంబంధించిన ఆధారాలను తొలగించేందుకు ఇక్కడ పడేశారా? ఆ నోట్ల పని చేయవని తెలిసి అక్కడ పారవేశారా? అనే కోణంలో స్థానికులు చర్చించుకున్నారు.

ALSO READ: వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

Advertisement

 

Related News

వెటర్నరీ శాఖలో ఉద్యోగాల భర్తీ.. ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోవడంపై వైసీపీ విమర్శలు, రంగంలోకి దిగిన మంత్రి

జనసేన క్లారిటీ.. జగన్‌ను బెంగళూరులో బాలినేని భేటీ వ్యవహారం, దీని వెనుక

ఏపీ గవర్నర్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం..!

తిరుమల బ్రహ్మోత్సవాలు.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రేటర్ మున్సిపల్‌గా తిరుపతి.. పెరిగిన డివిజన్లు!

విశాఖ పీఠంపై కూటమిలో టెన్షన్.. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య మేయర్ సీటు ఫైట్!

రోడ్లు, పార్కింగ్ కూడా ప్రభుత్వమే కట్టాలా? విశాఖ ఐటీ కంపెనీ వింత డిమాండ్లు!

Big Stories

Advertisement
×