E-Paper
Advertisement

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది

లాటరీలో వందల కోట్లు.. ఉద్యోగానికి రాజీనామా చేయకుండా ఆఫీస్‌‌లో అరాచకం, తెలుగులోనూ ఉంది
Advertisement

Korean Comedy Series: ఒక్కసారిగా కోట్ల రూపాయల విలువైన లాటరీ తగిలితే ఎవరైనా ఏం చేస్తారు ? ఉద్యోగానికి రాజీనామా చేసి హాయిగా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటారా ? లేక డబ్బు ఉన్నా రోజూ ఆఫీసుకు వెళ్లి అదే పనిని కొనసాగిస్తారా ? లాటరీలో భారీ మొత్తం గెలిచిన ఓ సాధారణ ఉద్యోగి మాత్రం రెండో దారినే ఎంచుకుంటాడు. అయితే డబ్బు చేతిలోకి వచ్చిన తర్వాత అతనిలో వచ్చిన మార్పు మాత్రం ఆఫీసు మొత్తాన్ని కుదిపేస్తుంది. బాస్‌లంటే భయం పోయి, మనసులో ఉన్నది నేరుగా చెప్పడం మొదలుపెడితే పరిస్థితి ఎలా మారుతుంది ? ఇదే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వచ్చిన సౌత్ కొరియన్ ఆఫీస్ కామెడీ-డ్రామా సిరీస్ ‘ది ఆర్డినరీ జాక్‌పాట్’ (The Ordinary Jackpot). మరి ఈ సిరీస్ తెలుగులో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

గాంగ్ ఉన్-టే పెద్ద లగ్జరీ బ్రాండ్ సంస్థ హాంగ్‌సాంగ్ ఇంటర్నేషనల్ లో సేల్స్ టీమ్ లీడర్‌గా పని చేస్తుంటాడు. ఎన్నో కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చినా… కార్పొరేట్ ఆఫీస్‌ లో ఉండే పాలిటిక్స్, బాస్‌ ల ఒత్తిడి, ప్రమోషన్ల కోసం జరిగే పోటీ అతన్ని మానసికంగా బాగా అలసిపోయేలా చేస్తాయి. బయటకు సాధారణ ఉద్యోగిలా కనిపించినా… లోపల మాత్రం ఉద్యోగం, డబ్బు, భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటాడు. అలాంటి సమయంలో ఉన్-టే జీవితంలో ఊహించని అదృష్టం తలుపు తడుతుంది. అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ కు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అన్ని పన్నులు మినహాయించిన తర్వాత అతని చేతికి ఏకంగా 1.3 బిలియన్ వాన్లు వస్తాయి.

Advertisement

ఇంత పెద్ద మొత్తం వచ్చిన తర్వాత ఇక ఉద్యోగం అవసరం లేదని ఎవరైనా అనుకుంటారు. కానీ ఉన్-టే మాత్రం అలా చేయడు. తన భవిష్యత్తు ఖర్చులు, ఆర్థిక పరిస్థితులను లెక్క వేసుకున్న అతనికి ఆ డబ్బుతో జీవితాంతం పని చేయకుండా బతకడం అంత సులభం కాదని అర్థమవుతుంది. అందుకే జాక్‌పాట్ గెలిచిన మరుసటి రోజే మామూలుగానే ఆఫీసుకు వెళ్లిపోతాడు. కానీ అతని జీవితంలో మారిన అసలు విషయం డబ్బు కాదు… ఆ డబ్బు ఇచ్చిన ధైర్యం. ఇప్పటివరకు ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో మౌనంగా ఉండే ఉన్-టే… ఒక్కసారిగా బాస్‌ లను ప్రశ్నించడం మొదలు పెడతాడు. తప్పు అనిపిస్తే ఎదుటివాళ్లు ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా తన అభిప్రాయాన్ని చెప్పడానికి వెనకాడడు. రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడడు. దీంతో అతని చుట్టూ ఉన్న ఆఫీస్ వాతావరణం క్రమంగా మారిపోతుంది.

అతని కింద అసిస్టెంట్ మేనేజర్‌ గా పనిచేసే యాంగ్ జున్-హో కు కూడా ఈ మార్పు అంతగా నచ్చదు. ప్రమోషన్ విషయంలో ఉన్-టేపై ఉన్న అసూయ, ఆఫీస్‌లోని అంతర్గత రాజకీయాలు కలిసి పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. డబ్బు మనిషి జీవితాన్ని మార్చడమే కాదు… అతని ఆలోచనా విధానం, ఇతరులతో వ్యవహరించే తీరు, నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని కూడా ఎలా మార్చగలదో ఈ సిరీస్ వినోదాత్మకంగా చూపిస్తుంది. చివరికి ఉన్-టే తన జాక్‌పాట్‌ను ఎలా ఉపయోగించుకున్నాడు ? ఆ డబ్బు అతని ఉద్యోగ జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్లింది ? ఆఫీస్‌లో అతని కొత్త వైఖరి ఎలాంటి పరిణామాలకు దారితీసింది ? అన్నది సిరీస్‌లో చూడాల్సిందే.

సిరీస్ తెలుగులో ఉందా ?

Advertisement

‘ది ఆర్డినరీ జాక్‌పాట్’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కొరియన్ ఆడియోతో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అలాగే తెలుగు, హిందీ డబ్బింగ్ కుడా అందుబాటులో ఉంది. లీ జూన్-హ్యుక్, సియో హ్యున్-వు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్… ఆఫీస్ పాలిటిక్స్, మిడిల్ క్లాస్ ఉద్యోగుల ఒత్తిడి, డబ్బు వచ్చాక మారే మనస్తత్వం వంటి అంశాలను కామెడీతో కలిపి తెరకెక్కించారు. కార్పొరేట్ లైఫ్‌పై సరదాగా సెటైర్ వేసే కథలు నచ్చితే ‘ది ఆర్డినరీ జాక్‌పాట్’ను ఓసారి ప్రయత్నించొచ్చు.

Read Also: పదేళ్ల తర్వాత మళ్లీ కలిసే పాత ప్రేమికులు.. కట్ చేస్తే ఊహించని స్కాండల్‌లో భర్త అడ్డంగా బుక్

Related News

కన్న తల్లిదండ్రులని చంపేసే లేడీ సైకో.. ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ తెలుగులో!

మిత్రుడి మరణం.. ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్‌ ఎంట్రీతో మతిపోగొట్టే ట్విస్ట్

సైబర్ క్రైమ్ స్కామ్ తో సర్వం కోల్పోయే అమ్మాయి.. క్లైమాక్స్ అదుర్స్, తెలుగులో మలయాళ థ్రిల్లర్

ఎడారిలో విమానం క్రాష్.. లేడీ సైంటిస్ట్ కిడ్నాప్.. గ్రిప్పింగ్ సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్

చిన్నారికి ఇచ్చిన మాట తప్పే దేవుడు.. శక్తులు కోల్పోయి భూమి మీదకు… తెలుగులో క్రేజీ ఫాంటసీ ధమాకా

భార్య హత్యకు ప్రతీకారం.. ఆర్మీ ఆఫీసర్ రివేంజ్ కిరాక్.. తెలుగులోనూ ఉంది

ఆఫ్ఘనిస్థాన్ అడవుల్లో హెలికాప్టర్ క్రాష్.. పదేళ్ళ చిన్నారి కోసం కమాండో డేరింగ్ సెర్చ్

Big Stories

Advertisement
×