E-Paper
Advertisement

మెట్రో పిల్లర్లనే మింగేస్తున్న రెస్టారెంట్లు.. ప్రశ్నించిన బిగ్ టీవీ రిపోర్టర్లపై రౌడీయిజం!

మెట్రో పిల్లర్లనే మింగేస్తున్న రెస్టారెంట్లు.. ప్రశ్నించిన బిగ్ టీవీ రిపోర్టర్లపై రౌడీయిజం!
Advertisement

Hyderabad Metro Pillar: హైదరాబాద్ మెట్రో పిల్లర్ల చుట్టూ చోటుచేసుకున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బిగ్ టీవీ వెలుగులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో మెట్రో పిల్లర్ల కింద ఉండాల్సిన ఫుట్ పాత్ ను మాయం చేసి నిర్మించిన రెస్టారెంట్ల గుట్టును బిగ్ టీవీ రిపోర్టర్లు విప్పారు. స్వయంగా గ్రౌండ్ లెవల్ లోకి వెళ్లి.. ఆక్రమణకు సంబంధించిన దృశ్యాలను కళ్లకు కట్టారు. పిల్లర్లకు అతి సమీపంలో ఉన్న ఈ రెస్టారెంట్ల కిచెన్ లో పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు ఉండటం భయాందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ అక్రమ నిర్మాణాలను ప్రశ్నించేందుకు వెళ్లిన బిగ్ టీవీ రిపోర్టర్ల పట్ల రెస్టారెంట్ నిర్వాహకులు దౌర్జన్యంగా ప్రవర్తించడం విస్మయానికి గురిచేస్తోంది.

మెట్రో పిల్లర్ల చుట్టూ వెలిసిన రెస్టారెంట్లు

జూబ్లీహిల్స్ రోడ్ నెం.5 నుంచి యూసఫ్ గూడా వెళ్తున్న దారిలో ఉన్న మెట్రో మలుపు కింద ఈ రెస్టారెంట్లు ఉన్నాయి. మెట్రోకు చెందిన 1553, 1554 పిల్లర్లను కింద నుంచి పూర్తిగా ఇవి కప్పేశాయి. ఈ రెస్టారెంట్లలోకి వెళ్తేనే పిల్లర్ల లోయర్ పార్ట్ కనిపించే పరిస్థితులు గ్రౌండ్ లెవల్లో ఉన్నాయి. ఏకంగా మెట్రో పిల్లలు బయటకు కనిపించకుండా మాయం చేసే స్థాయిలో వాటి చుట్టూ ఈ రెస్టారెంట్లు ఏర్పాటు కావడం భయాందోళనకు గురిచేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో పిల్లర్లపై అదనపు భారం పడేలా రూల్స్ విరుద్దంగా వీటి అక్రమ నిర్మాణానికి ఎవరు అనుమతించారన్న ప్రశ్నను బిగ్ టీవీ లేవనెత్తుతోంది. రెస్టారెంట్లలో ఉండే సిలిండర్ల కారణంగా ఏదైనా ప్రమాదం తలెత్తితే దానికి ఆనుకొని ఉన్న పిల్లర్ల పరిస్థింతేటని హోటల్ సిబ్బంది, అధికారులను బిగ్ టీవీ నిలదీస్తోంది.

ప్రమాదం జరగకముందే బిగ్ టీవీ అలర్ట్..

Advertisement

100 ఏళ్ల పాటు భాగ్యనగరానికి సేవలు అందించాలన్న లక్ష్యంతో హైదరాబాద్ లో మెట్రో ఏర్పాటు జరిగింది. అలాంటిది పిల్లర్ల చుట్టూ గుంతలు, అక్రమ నిర్మాణాల వల్ల వాటిపై విపరీతమైన భారం పడుతోంది. ముఖ్యంగా పిల్లర్ల చుట్టూ నిర్మించిన రెస్టారెంట్లను పరిశీలించిన అనంతరం రెండు పిల్లర్ల (నెం.1553, 1554) మధ్య 7 గ్యాస్ సిలిండర్లను రిపోర్టర్లు గుర్తించారు. అసలు పిల్లర్లకు అనుకొని ఉన్న స్థలాన్ని ఈ రెస్టారెంట్లకు లీజుకు ఇచ్చింది ఎవరు? మెట్రోనే వీళ్లకు కేటాయించిందా? లేదా ప్రైవేటు వ్యక్తులకు చెందిన స్థలమా? రెస్టారెంట్ యాజమాన్యం ఎవరికి అద్దె చెల్లిస్తోంది? వంటి ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు.

పిల్లర్ ను కమ్మెస్తూ గార్డెనింగ్

ఓ రెస్టారెంట్ అయితే ఏకంగా మెట్రో పిల్లర్ నే కస్టమర్లను ఆకర్షించే ఒక వస్తువుగా మార్చేయడం షాక్ కు గురిచేస్తోంది. పిల్లర్ను అనుకొని రెస్టారెంట్ ను నిర్మించడమే కాకుండా.. ఆ పిల్లర్ అందంగా కనిపించేందుకు దానిపై మెుక్కలతో గార్డెనింగ్ చేశారు. పిల్లర్ ను బలహీన పరిచేలా పెద్ద ఎత్తున మెుక్కలను ఏర్పాటు చేశారు. అటు రెస్టారెంట్ నిర్మాణాన్ని పరిశీలిస్తే.. మెట్రో పిల్లర్ పక్కన ఉన్న నేలపై ఎలాంటి తవ్వకాలు లేకుండా నిర్మించినట్లుగా అనిపించలేదు. మెట్రో పిల్లర్ కు సమీపంలో పునాది తవ్వి.. ప్రోపర్ గా ఒక నిర్మాణం చేపట్టినట్లుగా ఉందని బిగ్ టీవీ ప్రతినిధి స్వయం పరిశీలనలో వెల్లడైంది.

Advertisement

Also Read: మెట్రో పిల్లర్ల కింద గుంతలు.. అధికారులకు కాల్ చేస్తే.. లైవ్‌లోనే కడిగిపారేసిన బిగ్ టీవీ రిపోర్టర్లు!

బిగ్ టీవీ రిపోర్టర్ పై దౌర్జన్యం

మెట్రో పిల్లర్ ను అనుకోని రెస్టారెంట్ ను నిర్మించడమే కాకుండా దీనిపై ప్రశ్నించిన బిగ్ టీవీ అసోసియేట్ ఎడిటర్ రాకేష్ పై ‘ది హైవ్ హోటల్’ సిబ్బంది దౌర్యన్యానికి దిగారు. కెమెరాలతో రికార్డ్ చేయడానికి ఎవరు అనుమతి ఇచ్చారంటూ వాగ్వాదానికి దిగారు. ఈ రెస్టారెంట్ కు మీకు ఏంటి సంబందని తనతో వాగ్వాదానికి దిగిన వ్యక్తిని రాకేశ్ ప్రశ్నించగా.. అతడు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. పైగా తానేంటో చూపిస్తానంటూ కెమెరా ముందే బెదిరింపులకు దిగాడు. మరో రిపోర్టర్ సాగర్ తోపాటు మహిళా రిపోర్టర్ ను సైతం హోటల్ స్టాఫ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెస్టారెంట్ లోకి వెళ్తున్న సాగర్ ను బలవంతంగా బయటకు నెడుతూ రౌడీయిజం చేశారు.

Also Read: రూ.1000 కోట్ల మెట్రో స్కామ్.. రమణారెడ్డి పావు మాత్రమేనా? వెనకున్న అదృశ్య శక్తులు ఎవరు?

Tags

Related News

గూగుల్‌ని అడిగినా చెప్తుంది.. కేసీఆర్‌కు ఆ పేరు ఎందుకొచ్చిందో! – బల్మూర్ వెంకట్

కేసీఆర్, రేవంత్ రెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాలి.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

రూ.1000 కోట్ల మెట్రో స్కామ్.. రమణారెడ్డి పావు మాత్రమేనా? వెనకున్న అదృశ్య శక్తులు ఎవరు?

ఎన్నికల అఫిడవిట్‌తో అడ్డంగా దొరికిపోయిన కేసీఆర్.. మంత్రి పొంగులేటి సంచలనం!

మెట్రో పిల్లర్ల కింద గుంతలు.. అధికారులకు కాల్ చేస్తే.. లైవ్‌లోనే కడిగిపారేసిన బిగ్ టీవీ రిపోర్టర్లు!

డోర్నకల్ ఎమ్మెల్యేకు తప్పిన భారీ ప్రమాదం.. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు!

చేయూత పెన్షన్లకు భారీగా దరఖాస్తులు.. ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిన జిల్లా ఇదే..?

Big Stories

Advertisement
×