E-Paper
Advertisement

YS Sharmila : వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. దేవుడు, విజయమ్మే సాక్ష్యం..

YS Sharmila : వైఎస్ కుటుంబం చీలడానికి జగనే కారణం.. దేవుడు, విజయమ్మే సాక్ష్యం..
Advertisement

YS Sharmila : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచనల వ్యాఖ్యలు చేశారు. బుధవారం తిరుపతిలో తన అన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్‌ కుటుంబం చీలడానికి జగన్‌ కారణమని స్పష్టం చేశారు. జగనన్న వల్లే అనేందుకు సాక్ష్యం దేవుడు.. తన తల్లి విజయమ్మ అని పేర్కొన్నారు. కాకినాడలో కాంగ్రెస్‌ పార్టీ నేతలతో సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీని, తన కుటుంబాన్ని కాంగ్రెస్‌ పార్టీ చీల్చిందని జగన్‌ వ్యాఖ్యనించిన తర్వాత రోజు షర్మిల కౌంటర్ ఇచ్చి సంచలనం రేపారు.

ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ బలం పుంజుకుంటోందని వైఎస్‌ షర్మిల అన్నారు. పోలవరం.. వైఎస్‌ఆర్‌ కలల ప్రాజెక్టు అని చెప్పారు. వైఎస్‌ఆర్‌ సీఎం అయిన 6 నెలల్లోనే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తన తండ్రి ఆశయాలను జగన్ నెరవేరుస్తారు అని అనుకున్నానని పేర్కొన్నారు. కానీ నెరవేర్చలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం అభివృద్ధి లేకుండా దయనీయ స్థితిలో ఉందంటే దానికి కారణం సీఎం జగనే అని మండిపడ్డారు.

Advertisement

వైసీపీ అధికారంలోకి రావడానికి తానెంతో కృషి చేశానని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని వాళ్లను మంత్రులను చేస్తానని చెప్పి మోసం చేశారని జగన్ పై ఘాటు విమర్శలు చేశారు.

.

Advertisement

.

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×