Debts Remedies: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారా..? ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా..? సంపాదించిందంతా అప్పులకు వాటి వడ్డీలకే సరిపోతుందా..? ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారా..? అయితే శాస్త్రం ప్రకారం చిన్న చిన్న రెమెడీస్ పాటించమని పండితులు సూచిస్తున్నారు. వాటిని నియమనిష్టలతో పాటిస్తే త్వరలోనే మీ అప్పులు తీరడమే కాదు ఏకంగా మీకు కోట్లకు పడగలెత్తుతారట. ఇంతకీ ఆ రెమెడీస్ ఎంటో తెలుసా..? తెలియకపోతే ఇప్పడు ఈ కథనంలో తెలుసుకోండి.
జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. అలాగే అప్పుల్లో కూరుకుపోయి జీవితమే వ్యర్థంగా మారిపోయిన వ్యక్తులకు కూడా చాలా పరిహారాలున్నాయని పండితులు సూచిస్తున్నారు. అలాంటి పరిహారాలలో సులభమైన కొన్ని రెమెడీస్ ను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్పటిక గణపతికి పూజలు: ఎవరైతే ఇంట్లో దేవుని గుడిలో స్పటిక గణపతి విగ్రహాన్ని ఉంచి నిత్య పూజలు చేస్తారో వారికి ఎంతటి అప్పులున్నా…? క్రమంగా అప్పులు తీరి వాళ్లు త్వరలోనే కోట్లకు సంపాదిస్తారట. అయితే ఇదంతా చాలా నిష్టగా చేయాలని పండితులు సూచిస్తున్నారు.
లక్ష్మీ దేవి లాకెట్: ఎవరైతే ఎక్కువగా అప్పుల్లో ఉంటారో.. ఆ ఇంటి యజమాని భార్య ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి లాకెట్ ఉన్న గొలుసును మెడలో ధరించాలట. ప్రతిరోజు ఉదయమే ఇంట్లో పూజ చేసుకోవాలట. అలాగే లక్ష్మీ దేవికి చెందిన శ్లోకాలు, నామాలు, లేక కవచాలు పారాయణ చేస్తుండాలట. అప్పుడే ఆ ఇంటి యజమాని అప్పులు తీరిపోయి లాభాలు గడిస్తాడట.
చీమలకు ఆహారం ఇవ్వాలి: అప్పుల్లో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నవాళ్లు దగ్గరలోని ఆలయానికి వెళ్లి అక్కడ నల్ల చీమలకు ఆహారంగా పంచదార వేస్తుండాలి. ఇలా ప్రతి రోజూ వెళ్లాలి. ఒక వేళ ప్రతిరోజు వెళ్లడానికి కుదరని వాళ్లు ప్రతి గురువారం కచ్చితంగా వెళ్లాలి. ఇలా కొద్దిరోజులు చేశాక వారికున్న అప్పులు మొత్తం తీరిపోయి ధన సంపాదన పెరిగిపోతుందట. త్వరలో ఆ వ్యక్తులు కోట్లాది ఆస్తులు కూడబెడతారట.
మారేడు చెట్టుకు ప్రదక్షిణ: చేసినా అప్పులు తీరక.. సంపాదించిన డబ్బులు మిగలక ఎంతో ఇబ్బంది పడుతున్నవారు తమ కష్టాలు తీరాలంటే మారేడు చెట్టు దగ్గరకు వెళ్లి శాస్త్రోక్తంగా పూజించి.. ఆ చెట్టుకు ప్రదక్షిణ చేయాలట. ఇలా చేయడం వల్ల మెల్లగా వారికున్న అప్పులు తీరిపోతాయట. అలాగే సంపాదించిన డబ్బులు నిలబడి త్వరలోనే ఆ వ్యక్తి జీవితంలో బాగా స్థిరపడతారట.
లక్ష్మీదేవి నాణేలు పూజించాలి: ఎన్ని పరిహారలు చేసినా అప్పులు తీరకపోతే అటువంటి వాళ్లు లక్ష్మీదేవి నాణాలను ఇంట్లో దేవుణి మందిరంలో పెట్టుకుని ప్రతిరోజూ లక్ష్మీ అష్టోత్తరం. లేదా కనకధార స్తోత్రం పఠించాలట. అలాగే వినాయకుడి నాణేం కూడా దేవుని మందిరంలో పెట్టి శాస్త్రోక్తంగా పూజలు చేసి.. గణపతికి సంబంధించిన ఏదైనా స్తోత్రాలు పఠించాలని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.