Alia Bhatt: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్స్ గా మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) అలియా భట్(Alia Bhatt) దంపతులు. ఎంతో సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఇద్దరు ఇండస్ట్రీలో నటీనటులుగా మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అలియా భట్ ఆల్ఫా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా రణబీర్ కపూర్ రామాయణ సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలో ఆస్తిపాస్తులను సంపాదిస్తున్నారని చెప్పాలి.
ఆరు అంతస్తుల భవనం..
ఇకపోతే ఈ జంటకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో కదా రెండు రోజులుగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అతి త్వరలోనే ఆలియా భట్ దంపతులు తమ కొత్త ఇంట్లోకి(New House) అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అలియా భట్ దంపతులు తమ అభిరుచులకు అనుగుణంగా ఈ ఇంటిని తీర్చిదిద్దారని తెలుస్తోంది. ఆరు అంతస్తులు ఉన్న ఈ భవన నిర్మాణం దాదాపు పూర్తి అయిందని, ఈ దీపావళి పండుగ సందర్భంగా ఆలియా దంపతులు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఆ ఇల్లు ఇంద్రభవనాన్ని తలపిస్తుందని చెప్పాలి.
దీపావళికి కొత్త ఇంట్లోకి
చుట్టూ అందమైన మొక్కలతో పాటు సముద్ర తీరం కనిపించే విధంగా ఈ ఇంటి నిర్మాణం ఉంది. ఇక ఈ ఇంటికి రణబీర్ దంపతులు దివంగత దిగ్గజ చిత్రనిర్మాత రాజ్ కపూర్ భార్య కృష్ణ కపూర్ పేరు పెట్టారు. దాదాపు ఈ ఇంటి నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని కేవలం ఇంటీరియర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. దీపావళి పండుగకు ఈ పనులన్నీ పూర్తి చేసుకొని దీపావళి పండుగను ఈ జంట కొత్త ఇంట్లో జరుపుకునేలా ప్లాన్ చేస్తున్నారు అలాగే తమ కుమార్తె రాహ పుట్టినరోజు(Raha Birthday) వేడుకలను కూడా ఈ కొత్త ఇంట్లోనే నిర్వహించాలని ఈ దంపతులు ప్రణాళికలు వేసుకున్నారని తెలుస్తోంది.
Ranbir Kapoor’s new bungalow simple and elegant ✨ pic.twitter.com/dkfaLYrkmH
— 𝓐𝔂𝓪𝓷 🚩 (@behind_you_rk) August 23, 2025
ప్రస్తుతం ఈ 250 కోట్ల రూపాయల ఇంటికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బయటనుంచి చూస్తుంటేనే ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న ఈ బంగ్లా లోపల ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ముందుగా ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఆలియా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా ప్రస్తుతం తెలుగులో విడుదలవుతున్నాయి. ఇక రణబీర్ కపూర్ సైతం బ్రహ్మాస్త్ర సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇచ్చారు.
Also Read: Actress Prerana: క్యాస్టింగ్ కౌచ్ పై ప్రేరణ షాకింగ్ కామెంట్స్…అంతలా టార్చర్ పెట్టారా?