Green Camphor: పచ్చ కర్పూరానికి ఉన్న పవరేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎన్నో మహిళలు శక్తులు ఉన్న పచ్చకర్పూరం హిందూ సంప్రదాయంలో పవిత్రమైన వస్తువే కాదు ఆయుర్వేదంలో వాడే ఒక ఓషధం కూడా అని ఎంత మందికి తెలుసు. అసలు పచ్చ కర్పూరంతో జరిగే అద్బుతాలేవీ ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో పచ్చకర్పూరానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పచ్చ కర్పూరాన్ని సాక్ష్యాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిగా బావిస్తుంటారు. అలాంటి పచ్చ కర్పూరంతో జీవితంలో ఎన్నో అద్బుతాలు చూడొచ్చంటున్నారు పండితులు ఆవేంటి ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చ కర్పూరం బొట్టు: ప్రతి రోజూ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదిటిన బొట్టు పెట్టుకుంటే జరిగే అద్బుతాలే వేరు అంటున్నారు పండితులు. సాక్ష్యాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామినే నుదుటిన ధరించన పుణ్యం వస్తుందట. ఇలా బొట్టు పెట్టుకున్న వారిక ఆ శ్రీవారి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుందట.
కుంకుమపువ్వులో కలిపితే: ధనలాభం బాగా కలగాలంటే సంపాదించిన డబ్బు నిలబడాలంటే పచ్చ కర్పూరాన్ని కుంకుమపువ్వుతో కలిసి డబ్బు పెట్టలో పెట్టాలని సూచిస్తున్నారు పండితులు.
వ్యాపారం లో లాభాలు: వ్యాపారం చేసేవారు. లాభాలు బాగా రావాలంటే ప్రతి రోజు పచ్చకర్పూరం కలిపిన కుంకుమను బొట్టుగా ధరిస్తే వ్యాపారంలో లాభాల బాట పడుతుందట.
దేవునికి నైవేద్యం: ఎన్ని పూజలు చేసినా దేవునికి నైవేద్యం పెట్టకపోతే ఆ పూజలో వెలితిగానే అనిపిస్తుంది. అయితే పచ్చ కర్పూరం కలిసి తీసి పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెడితే ఆ ఇంట్లో చెప్పలేనని శుభాలు జరుగుతాయట.
హోమం : పచ్చ కర్పూరంతో హోమం, కానీ యాగం కానీ చేస్తే ఆ హోమం ఫలం పూర్తిగా లభిస్తుందట. అలాగే ఆ హోమం దగ్గరకు వశీకరణ శక్తులు బాగా వస్తాయట.
సంఘంలో గౌరవం కోసం: చాలా మంది రాజకీయంగా ఎదగాలనుకుంటారు. కానీ వారికి పెద్దగా ప్రజల నుంచి రెస్పాన్స్ రాదు. అలాగే ఎదుటి వారి నుంచి గౌరవం లభించాలన్నా పచ్చకర్పూరాన్ని దేవాలయంలో దానంగా ఇవ్వమని పండితులు సూచిస్తున్నారు.
సంతానం కోసం: పిల్లలు లేని దంపతులు సంతానం కలగాలని పచ్చ కర్పూరంతో పాలను కలిసి మంగళవారం నాడు శ్రీ సుబ్రమణ్య స్వామికి అభిసేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే వారికి ఉన్న అన్ని గర్బ దోషాలు నివారణ అయి వారికి సంతానం కలుగుతుందట.
పనుల్లో విజయం కోసం: ఎవరైనా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఒక్క పనిలోనూ సక్సెస్ రాకపోయినా.. ఏ పని చేద్దామని మొదలు పెట్టినా మధ్యలోనే ఆగిపోతుంటే..అటువంటి వారు పచ్చ కర్పూరాన్ని ఆలయంలోని బ్రహ్మణులకు దానం చేయాలని అప్పుడే మీ పనుల్లో ఆటంకాలు తొలగి విజయం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.