E-Paper
Advertisement

Numerology: 4వ తేదీన పుట్టారా…? న్యూమరాలజీ ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా..?

Numerology: 4వ తేదీన పుట్టారా…? న్యూమరాలజీ ప్రకారం మీరు ఏ రంగంలో సెటిల్ అవుతారో తెలుసా..?
Advertisement

Numerology: మీరు నాలుగవ తేదీన పుట్టారా..? అయితే న్యూమరాలజీ ప్రకారం మీ భవిష్యత్తు ఏ ఫీల్డ్‌లో బాగుంటుందో తెలుసా..? మీరు ఏ రంగంలో సెటిల్‌ అవుతారో తెలుసా..? అసలు 4వ తేదీలో పుట్టిన వారి గురించి న్యూమరాలజిస్టులు ఏమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం 4వ తేదీలో జన్మించిన వ్యక్తులు రాహువు (Rahu) గ్రహ ప్రభావానికి లోబడి ఉంటారట. వీరు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారట. 4వ తేదీన పుట్టిన వారి జాతకంలోని ముఖ్య విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

వ్యక్తిత్వం, స్వభావం: 4వ తేదీన పుట్టిన వారు చాలా క్రమశిక్షణతో పద్ధతిగా ఉండటానికి ఇష్టపడతారట. ఏ పనిని చేసినా చాలా జాగ్రత్తగా, విశ్లేషణాత్మకంగా చేస్తారట. వీరు శ్రమజీవులట.  ఎంత కష్టం ఉన్నా ఏదైనా సాధించడానికి వెనకాడరట. వీరు బయటకు కఠినంగా కనిపించినా, లోపల చాలా నిజాయితీగా, నమ్మకస్తులుగా ఉంటారట. అన్యాయాన్ని ఏమాత్రం సహించరట. ఏదైనా ఒక విషయాన్ని నమ్మితే దాని నుంచి వెనక్కి తగ్గరట. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తారట.

కెరీర్, ఆర్థిక పరిస్థితి: ఏ నెలలో అయినా సరే 4వ తేదీన పుట్టిన వాళ్లు ఇంజనీరింగ్, పరిశోధన (Research), అకౌంటింగ్, చట్టపరమైన వ్యవహారాలు, లేదా సాంకేతిక రంగాలలో బాగా రాణిస్తారట. వీరు డబ్బు విషయంలో చాలా పొదుపుగా, జాగ్రత్తగా ఉంటారట. అనాలోచితంగా ఖర్చు చేయడం వీరికి నచ్చదట. జీవితంలో స్థిరమైన ఆర్థిక స్థితిని సాధిస్తారట. కొన్నిసార్లు వివాదాస్పదంగా ఉన్నా, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు సిద్ధహస్తులట. వీరు ఎక్కువ మార్పులను స్వాగతించరట. ఎప్పుడూ పాత పద్ధతులకే కట్టుబడి ఉండటం వల్ల, కొత్త మార్పులను స్వీకరించడానికి కొంచెం సమయం తీసుకుంటారట. అయితే వీరికున్న  ప్రధాన బలహీనత ఆవేశపడటం. అకస్మాత్తుగా ఆవేశపడటం వీరికున్న అతిపెద్ద బలహీనతగా న్యూమరాలజిస్టులు సూచిస్తున్నారు. ఈ ఆవేశం కారణంగా జీవితంలో చాలా నష్టపోతారట.

Advertisement

జీవితంలో ఎదగడానికి సూచనలు: 4వ తేదీలో పుట్టిన వారికి జీవితంలో కలిసి రావాలంటే కొన్ని నియమాలు పాటించాలట. వీరు ఏ పని చేసినా ఒకటి, నాలుగు, ఆరు, ఎనిమిది తేదీలలో మొదలుపెడితే బాగా కలిసి వస్తుందట. అలాగే వీరికి బూడిద రంగు (Grey), నీలం రంగు,  గోధుమ రంగు అనుకూలమైనవట. ఈ రంగుల దుస్తులు వేసుకోవడం. ఈ రంగుల వాలెట్స్‌ వాడటం లాంటివి చేయాలని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతికూల సమయం: ఈ నాలుగవ సంఖ్యంలో పుట్టిన వారు తమ జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని సంఖ్యాశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాల వల్ల వీరికి వేరే వారితో విభేదాలు వచ్చే ప్రమాదం ఉంటుందట. ఇలా విభేదాలు రావడం వల్ల 4వ తేదీలో పుట్టిన వారు నష్టపోయే అవకాశం ఉంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: బ్రహ్మంగారి కాలజ్ఞానం – కలియుగం అప్పుడే అంతం అవుతుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×