E-Paper
Advertisement

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్
Advertisement

MLA Markandeyan Arrest: తమిళనాడులో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికార టీవీకే-విపక్ష డీఎంకె మధ్య మాటల యుద్ధం ముదిరి చివరకు అరెస్టుల వరకు వెళ్లింది. తాజాగా సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకె మార్కండేయన్‌ను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమిళనాట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం-డీఎంకే ఎమ్మెల్యే జీవీ ఏమన్నారు? దక్షిణ తమిళనాడులోని కొవిల్‌పట్టిలోని కృష్ణన్ కోవిల్ మైదానంలో రాత్రి డీఎంకే పార్టీ బహిరంగ సభ  ఏర్పాటు చేసింది. ఈ సభకు డీఎంకె పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ వేదికపై విలాతికుళం డీఎంకే ఎమ్మెల్యే జీవీ మార్కండేయన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

సీఎం విజయ్‌పై డీఎంకె ఎమ్మెల్యే హాట్ కామెంట్స్-అసెంబ్లీలో సమావేశమైతే నీ ఎముకలు మిగలవు, డీఎంకే శాసనసభ్యులు నీ ఎముకలు విరగ్గొట్టి నిన్ను వెనక్కి పంపుతారు అంటూ నేరుగా సీఎం విజయ్‌ని ఉద్దేశించి ఘాటు హెచ్చరికలు చేశారు సదరు ఎమ్మెల్యే. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎంపై హింసాత్మక, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఓ శాసనసభ్యుడు చేయడంపై దుమారం రేగింది.

ఎమ్మెల్యే మార్కండేయన్ ను అరెస్ట్-రాజకీయ వర్గాల నుండే కాకుండా ప్రజల నుండి విమర్శలు వ్యక్తమయ్యాయి. సదరు ఎమ్మెల్యే మాటల వీడియో వైరల్ అయ్యింది. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున విలాతికుళంలో ఎమ్మెల్యే  మార్కండేయన్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Advertisement

ఎమ్మెల్యే జీవీ అరెస్ట్ విషయం తెలియగానే ఆయన మద్దతుదారులు, డీఎంకే కార్యకర్తలు భారీగా ఆయన నివాసానికి చేరుకున్నారు. విజయ్ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకానొక దశలో ఎమ్మెల్యే మార్కండేయన్‌ను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు  ప్రయత్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

ALSO READ: ట్రీట్‌మెంట్‌కి  వచ్చాడు..  ఫ్యాన్ చంపేసింది, అనుకోకుండా ఆసుపత్రిలో ఏం జరిగిందంటే

చివరకు నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు, మార్కండేయన్‌ను విచారణ నిమిత్తం జిల్లా ఎస్పీ ఆఫీసుకు తరలించారు. ప్రాథమిక విచారణ తర్వాత ఎమ్మెల్యేను కోర్టులో హాజరుపర్చనున్నారు. డీఎంకె ఎమ్మెల్యే అరెస్టుతో తమిళనాడులో అధికార టీవీకే- డీఎంకే పార్టీల మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. కేవలం తమిళనాడులోనే కాదు.. ఈ మధ్యకాలంలో విపక్ష సభ్యులు.. ముఖ్యమంత్రులను రెచ్చగొట్టేలా మాట్లాడడం సాధారణమైపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు తమ పని చేసుకుంటూ పోతున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×