zodiac signs: శ్రీరామనవమి తర్వాత ఆ నాలుగు రాశుల్లో పుట్టిన జాతకులు కోట్లు సంపాదిస్తారట. మరో పదేళ్ల వరకు వాళ్లు పట్టిందల్లా బంగారం అవుతుందట. వచ్చే దశాబ్దం కాలంలో కోట్లు కొల్లగొట్టబోయే ఆ నాలుగు రాశుల జాతకులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల సంచారం మరియు వివిధ యోగాల ప్రభావంతో రాశులపై ఆర్థికపరమైన మార్పులు రావడం సహజమేనని పండితులు సూచిస్తున్నారు. అయితే ఈ శ్రీరామనవమి (27-03-2026) తర్వాత గ్రహాల గమనం మరియు జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం ఈ క్రింది రాశుల వారికి ఆర్థికంగా మరియు వృత్తిపరంగా శుభప్రదమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు. ఈ నాలుగు రాశుల వారు వచ్చే పదేళ్లలో కోట్లు సంపాదిస్తారట.
మిథున రాశి (Gemini): శ్రీరామనవమి తర్వాత ఈ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాశి వారికి ఆదాయ వనరులు పెరగుతాయట. గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు పొందే అవకాశం ఉందట. అలాగే కొత్త ప్రాజెక్టులు మరియు వృత్తిపరమైన అవకాశాలు వీరి ఆర్థిక స్థితినే మార్చివేస్తాయట.
సింహ రాశి (Leo): ఈ శ్రీరామనవమి తర్వాత అదృష్టం పట్టబోయే మరో రాశి సింహరాశి. ఈ రాశి వారికి రాబోయే కాలం చాలా అనుకూలంగా ఉంటుందట. వీరికి ఉన్న గజకేసరి యోగం వంటి గ్రహస్థితులు వీరికి వృత్తి, వ్యాపారాల్లో పెద్ద విజయాలను అందిస్తుదట. వీరికి వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు లభిస్తాయట. కొత్త పరిచయాల ద్వారా ఆదాయం పెరుగుతుందట. ఇంకా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికావడం వల్ల ఆర్థిక భరోసా లభిస్తుందట.
వృషభ రాశి (Taurus): ఈ శ్రీరామనవమి తర్వాత అదృష్టం పట్టబోయే మరో రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసివచ్చే సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చెబుతున్నారు. వీరికి కెరీర్‌లో ప్రమోషన్లు లేదా జీతాల పెంపుదల ఉండే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఆశించిన లాభాలు అందుకోవచ్చు. స్థిరాస్తుల కొనుగోలుకు కూడా అనుకూలంగా ఉంటుందట.
తులా రాశి: శ్రీరామనవమి తర్వాత తులా రాశి వారికి అద్బుతంగా ఉంటుందని.. వీరికి సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ రాశి ఉద్యోగులకు ఆఫీసులో పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మద్దతు మీకు అనుకూలంగా మారుతుందట. ఇక వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందట. అయితే ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదట. ఆదాయం కూడా స్థిరంగా ఉంటుందట ఆస్తి లేదా స్థిరాస్తుల విషయంలో తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారుతాయట. ఇక మీకు శ్రీరామనవమి తర్వాత జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయట. కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు లేదా వేడుకల గురించి చర్చలు జరగవచ్చట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.