Goddess Lakshmi: ఏ ఇంట్లో అయితే పూజ గదిలో ఆ వస్తువులు ఉంచుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందట. ఆ ఇట్లో ఉన్న వాళ్ల సంపద హఠాత్తుగా పెరిగిపోతుందట. వాళ్లు పట్టిందల్లా బంగారంలా మారిపోతుందట. వాళ్ల అదృష్టానికి అవధులు లేకుండాపోతుందట. సాక్ష్యాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉండగా ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి సమస్యలు రావట. ఇంతకీ ఏ వస్తువులు పూజగదిలో ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, పూజ గదిలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరిగి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు సూచిస్తుంటారు. అయితే పూజ గదిలో ఉంచాల్సిన వస్తువులు ఏంటి..? ఎప్పుడు ఉంచాలి.. ఎలా ఉంచాలి..? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూజగదిలో ఉంచాల్సిన మంగళప్రదమైన వస్తువులు: పూజ గదిలో నీటితో నింపిన రాగి లేదా వెండి కలశం ఉంచడం శుభప్రదట. ఇది సంపదకు మరియు సానుకూలతకు చిహ్నమని పండితులు సూచిస్తున్నారు. ఇక లక్ష్మీదేవి ఎప్పుడూ గజలక్ష్మి రూపంలో (ఏనుగులతో ఉన్న రూపం) లేదా పద్మంపై కూర్చున్న రూపంలో ఉన్న ఫోటోలే కానీ విగ్రహాలు కానీ మీ పూజగదిలో ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్లకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది శ్రీ యంత్రం పూజ గదిలో ఉంచుకోవాలట. దీన్ని ఇంట్లో పూజగదిలో శాస్త్రోక్తంగా ప్రతిష్టించి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయట. అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన శంఖం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. పూజ తర్వాత శంఖాన్ని ఊదడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశిస్తుందట.
పూజగదిలో ఉచాల్సిన ప్రకృతి ప్రసాదించిన వస్తువులు: ఇంట్లో పూజగదిలో తామర పువ్వులు తప్పకుండా ఉంచాలట. లక్ష్మీదేవికి తామర పువ్వులంటే చాలా ఇష్టం. తామర గింజల మాలను పూజ గదిలో ఉంచడం వల్ల కూడా అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయట. ఇక సముద్రం నుండి లభించే గోమతి చక్రాలను కూడా పూజగదిలో ఉంచుకోవాలట. ఈ గోమతి చక్రాలను పసుపు గుడ్డలో ఉంచి పూజ గదిలో పెడితే ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయట. ఇక పూజ గదిలో ఏకాక్షి నారికేళం ఉంచడం కూడా లక్ష్మీదేవి కృపకు పాత్రులు అవుతారట. సాధారణ కొబ్బరికాయలకు మూడు కళ్ళు ఉంటాయి, కానీ ఒకే కన్ను ఉన్న కొబ్బరికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అదే ఏకాక్షి నారికేళం అని పండితులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పూజ గదిలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలట. వాడిపోయిన పూలను, విరిగిన విగ్రహాలను అక్కడ ఉంచకూడదట. పూజ గదిలో ఎప్పుడూ స్వచ్ఛమైన గంధం మరియు పసుపుతో కలిపిన అక్షింతలు అందుబాటులో ఉండాలట. ఈ వస్తువులతో పాటు, ఇంట్లో ఎప్పుడూ కలహాలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణం ఉంటే లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.