E-Paper
Advertisement

Veedhi Potu: ఆ దిక్కు వీధిపోటున్న ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయట

Veedhi Potu: ఆ దిక్కు వీధిపోటున్న ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయట
Advertisement

Veedhi Potu:  వీధిశూల లేదా వీధిపోటు అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. అయితే మనుషుల్లో మంచివారు చెడ్డవారు ఎలా ఉంటారో వీధిపోటులో కూడా మంచి, చెడ్డ ఉంటాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అయితే ఏ వీధిపోటు మంచి చేస్తుంది ఏ వీధిపోటు చెడు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి ఇంటికి ఒక దారి ఉంటుంది. అయితే ఆ దారి ఇంటిలోకి వస్తున్నట్టు లేదా డైరెక్ట్‌ స్థలంలోకి వస్తున్నట్టుగా ఉంటే దానిని వీధిపోటు అంటారు. స్థలం తీసుకున్నప్పుడే ఈ వీధిపోట్లను గుర్తించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ వీధిపోటు ఎలాంటి ఫలితాలనిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

తూర్పు ఈశాన్య వీధిపోటు: తూర్పు ఈశాన్య వీధిపోటు ఆ గృహంలో నివశించే పురుషులపై ప్రభావం చూపుతుంది. ఇంటా బయటా వీరిదే పైచేయి అన్నట్లుంటుంది. ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మంచి గుర్తింపు, మన్నన వీరికి లభిస్తాయి. సమాజంలో మంచి గౌరవ ప్రతిష్ఠలు పొందగల్గుతారు. ఇది శుభప్రదమైన వీధిపోటు అని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

ఉత్తర ఈశాన్యం వీధిపోటు: ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఎంతో శుభప్రదం, లాభదాయకం, ఇంట సిరులు కురిపించే వీధిపోటు అని వాస్తు శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు. ఈ ఇంట ధనమే కాదు, ఆరోగ్యం కూడా దండిగా ఉంటుందట. ఈ ఇంటో నివశించే దంపతులు ఎంతో అన్యోన్యంగా దాంపత్యాన్ని సాగిస్తారట. కుటుంబ సభ్యుల నడుమ మమతానురాగాలు వెల్లివిరుస్తాయట. ఇంటా బయటా స్త్రీ పురుష బేధం లేకుండా ఈ ఇంట నివసించే వారికి మంచి పేరు ప్రతిష్ఠలు లభిస్తాయట.

Advertisement

ఉత్తర వాయువ్యం వీధిపోటు: ఈ వీధిపోటు శుభదాయకం కాదు. ముఖ్యంగా ఈ వీధిపోటు ఉన్న ఇంట నివశించే మహిళలపై ప్రభావం చూపుతుందట. మనశ్శాంతిగా ఉండలేరట. సంసారంలో సుఖ సౌఖ్యాలు కరువవుతాయట. ఆడపిల్లలకు చదువు అబ్బదట. వివాహాల సమయంలో కూడా ఎన్నో చిక్కులు ఎదురవుతాయట. ఇలాంటి స్థలాన్ని కానీ, ఇంటిని కానీ కొనకూడదట.

పశ్చిమ వాయువ్యం వీధిపోటు: పశ్చిమ వాయువ్య దిశలో ఇంటికి ఎదురుగా వీధి ఉన్నట్లయితే దాన్ని పశ్చిమ వాయువ్య వీధిపోటుగా పరిగణించాలట. ఈ వీధిపోటు ఉన్న స్థలం మంచిదేనట. ఈ వీధిపోటు పురుషులపై సత్ప్రభావం చూపుతుందట. రాజపూజ్యం, గౌరవ ప్రతిష్ఠలు పెరిగేలా చేస్తుందట. ఈ ఇంట్లో నివసించే రాజకీయ నాయకులు త్వరగా ఎదుగుతారట. వీళ్లు మట్టిని ముట్టుకున్నా బంగారం అవుతుందట.

పశ్చిమ నైరుతి వీధిపోటు: ఈ వీధిపోటు ఉన్న ఇంట్లో నివసించే పురుషులపై ఎక్కువ ప్రభావం చూపుతుందట. కష్టానికి తగ్గ ఫలితం లభించదట. నిరాశా నిస్పృహలకు గురిచేస్తుందట. మనశ్శాంతిని హరిస్తుందట. జీవితం ఆపజయాల జాతర అన్నట్లు మారుతుందట. ఆపవాదులు, నిందలు, ఈ ఇంట మగవారిని బాధిస్తాయట. విజయం చేతికందినట్లే అంది పరాజయాన్ని మిగులుస్తుందట.

దక్షిణ నైరుతి వీధిపోటు: దక్షిణ నైరుతికి ఎదురుగా వీధి ఉంటే.. దాన్ని దక్షిణ నైరుతి వీధిపోటుగా భావించాలి. ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని, ఇంటిని కొనకూడదట. ప్రత్యేకించి ఈ వీధిపోటు ప్రభావవం ఆ ఇంట గృహిణిపైన ఉంటుందట. కాపురం కలతల కల్లోలంగా మారుతుందట. దాంపత్యంలో అనురాగం కొరవడుతుందట. ఇంటి యజమానురాలి ఆరోగ్యం బాగుండదట. ఏ కార్యం తలపెట్టినా ఎదురుతిరుగుతుందట. మనసు ఎప్పుడూ కల్లోల సాగరంలా ఉంటుందట.

దక్షిణ ఆగ్నేయ వీధిపోటు: ఇలాంటి వీధిపోటు ఉన్న స్థలాన్ని, ఇంటినీ నిశ్చింతగా కొనవచ్చట. ఈ ఇంట నివసించేవారు ఆనందప్రదమైన జీవితాన్ని అనుభవిస్తారట. డబ్బుకు కొదవే ఉండదట. అలానే ఈ ఇంట నివసించే వారికి ఆరోగ్యానికి కొదవ ఉండదట. ఎప్పుడూ ఈ ఇల్లు ధన ధాన్యాలతో తుల తూగుతూ ఉంటుందట.

తూర్పు ఆగ్నేయ వీధిపోటు: తూర్పు ఆగ్నేయ దిశలో వీధిపోటు ఉందంటే ఆ ఇంట నివశించే వారి జీవితం ఎప్పుడూ అల్లకల్లోలం అన్నట్లుంటుందట. విజయాలు శూన్యం… అపజయాలు అపారం.. అన్నట్టుగా సాగుతుందట జీవితం. అటు వృత్తిలో అయినా ఇటు వ్యాపారంలో అయినా విజయం ఎండమావే అవుతుంటుందట. తూర్పు ఆగ్నేయ వీధిపోటున్న ఇంటిని, స్థలాన్ని కొనకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మొలతాడు కట్టుకోవడంలో దాగి ఉన్న సైన్స్ రహస్యాలు ఏంటో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×