Anasuya Bharadwaj (Image credit: Instagram)
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్గా తన కెరీర్ ను మొదలుపెట్టి.. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత యాంకర్ గా తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది.

Anasuya Bharadwaj (Image credit: Instagram)
ఒకవైపు అద్భుతమైన వాక్చాతుర్యం.. మరొకవైపు అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె జబర్దస్త్ షోకి ప్రత్యేక అలంకరణగా నిలిచింది అనడంలో సందేహం లేదు.. ముఖ్యంగా అనసూయ హోస్టుగా చేసిన ప్రతి ఎపిసోడ్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది.

Anasuya Bharadwaj (Image credit: Instagram)
ఇకపోతే జబర్దస్త్ లో యాంకర్ గా చేస్తూనే.. మరొకవైపు సినిమాలలో కూడా తన సత్తా చాటింది అనసూయ. అలా రామ్ చరణ్ రంగస్థలం , అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకుంది.

Anasuya Bharadwaj (Image credit: Instagram)
ఇకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్న ఈమె.. మరొకవైపు తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

Anasuya Bharadwaj (Image credit: Instagram)
ఈ మధ్యకాలంలో శివాజీ చేసిన వస్త్రధారణ కామెంట్లపై తన గళం విప్పిన ఈమె తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా చీర కట్టులో కూడా అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. ఫోటోలు షేర్ చేస్తూనే అన్నీ సవ్యంగా మారకముందు ప్రతిదీ నెగటివ్ గానే అనిపిస్తుంది అంటూ తన అభిప్రాయాలను పంచుకుంది.

Anasuya Bharadwaj (Image credit: Instagram)
ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫోటోలు.. పంచుకున్న క్యాప్షన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.