E-Paper
Advertisement

8వ తేదీన పుట్టిన వారు నిశ్శబ్ద విజేతలట – ఇంకా న్యూమరాలజీ ఏం చెప్తుందంటే

8వ తేదీన పుట్టిన వారు నిశ్శబ్ద విజేతలట – ఇంకా న్యూమరాలజీ ఏం చెప్తుందంటే
Advertisement

Numerology: 8వ తేదీన పుట్టారా..? అయితే మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా..? మీరు ఏ రంగంలో స్థిరపడతారో తెలుసా… మీకు కలిసొచ్చే అంశాలేంటో తెలుసా..? అసలు మీరు ఎప్పటికైన నిశ్శబ్ద విజేతలవుతారట. ఇంకా మీ గురించి న్యూమరాలజీ ఏం చెప్తుదో ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం 8వ తేదీల్లో జన్మించిన వారి మీద శని ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఈ 8 సంఖ్యకు అధిపతి శనీశ్వరుడేనట. శని ప్రభావం వల్ల 8వ తేదీలో పుట్టిన వారి జీవితం క్రమశిక్షణ, పట్టుదల మరియు పోరాటంతో కూడి ఉంటుందట.

Advertisement

8వ తేదీన పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది: 8 వ తేదీన పుట్టిన వారు ఏ పని చేపట్టినా అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరట. చాలా కష్టపడే తత్వం వీరికి ఉంటుందట. అయితే బయటకు చాలా సీరియస్‌గా తక్కువగా మాట్లాడేవారిలా కనిపించినా… లోపల చాలా మృదు స్వభావులట. వీరు అబద్ధాలను, అన్యాయాన్ని అస్సలు సహించరట. వీరు ఎప్పుడూ  నిజాయితీగా ఉంటారట. అయితే వీరు తమ ప్రణాళికలను ఎవరికీ చెప్పరట. విజయం సాధించిన తర్వాతే అందరికీ తెలిసేలా చేస్తారట. అందుకే వీళ్లను నిశ్శబ్ద విజేతలు అంటారట.

8వ తేదీలో పుట్టిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది: 8వ సంఖ్య కలిగిన వారు సాధారణంగా శ్రమతో కూడిన, బాధ్యతాయుతమైన రంగాలలో అద్భుతంగా రాణిస్తారట. వీరు లాయర్లుగా, జడ్జిలుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారట. ఐఏఎస్, ఐపిఎస్ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు లేదా రాజకీయాల్లో కూడా వీరు మంచి పట్టు సాధిస్తారట. ఇక భూమికి సంబంధించిన వ్యాపారాలు, సివిల్ ఇంజనీరింగ్, ఇనుము, యంత్రాలకు సంబంధించిన పరిశ్రమల్లో వీరు బాగా స్థిరపడతారట. అలాగే బ్యాంకింగ్, ఆడిటింగ్ లేదా పెద్ద సంస్థల్లో ఫైనాన్స్ మేనేజర్లుగా కూడా 8వ తేదీలో పుట్టిన వ్యక్తులు  రాణిస్తారట.

Advertisement

8వ తేదీలో పుట్టిన వారికి కలిసి వచ్చే విషయాలు: 8వ తేదీలో పుట్టిన వారికి ముదురు నీలం, నలుపు, ఉదా రంగులు కలిసొచ్చే కలర్స్ అని పండితులు చెప్తున్నారు. ఇక శనివారం వీరికి అత్యంత అనుకూలమైన రోజట. శుక్రవారం కూడా మంచి ఫలితాలే ఇస్తుందట. వీరికి 8, 17, 26 తేదీలతో పాటు 5, 6 సంఖ్యలు కూడా బాగా కలిపి వస్తాయట.

8వ తేదీ వారికి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు:  8వ తేదీలో పుట్టిన వారి జీవితం మొదట్లో కొంత కష్టాలు ఉన్నప్పటికీ వయస్సు పెరిగే కొద్ది కష్టాలు తీరిపోతుంటాయట. వీరు 35 ఏళ్ల తర్వాత ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతారట. వీరికి 17, 26, 35, 44, 53 ఏళ్లల్లో చాలా కీలకమైన మలుపులు చూస్తారట.

ఇక 8వ తేదీలో పుట్టిన వారి మీద శని ప్రభావం ఉన్నందున వీరు ఎంత కష్టపడితే అంత గొప్ప ఫలితాలను పొందుతారట. పేదలకు లేదా కార్మికులకు సహాయం చేయడం వల్ల వీరికి మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: అక్షింతలు కలిపేటప్పుడు ఆ తప్పు అసలు చేయకూడదట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×