E-Paper
Advertisement

అక్షింతలు కలిపేటప్పుడు ఆ తప్పు అసలు చేయకూడదట

అక్షింతలు కలిపేటప్పుడు ఆ తప్పు అసలు చేయకూడదట
Advertisement

Akshintalu: శుభకార్యాలలో కానీ దేవుడి పూజ కోసం కానీ  అక్షింతలు కలుపుతున్నారా..? అయితే అక్షింతలు కలిపేటప్పుడు ఆ తప్పులు అసలు చేయకూడదట. చేస్తే మీరు కలిపిన అక్షింతలకు పవిత్రతే ఉండదట. అసలు అవి అక్షింతలే కావని పండితులు చెప్తున్నారు. అయితే అక్షింతలు ఎలా కలపాలి..? కలిపేటప్పుడు అందరూ చేసే తప్పులేంటి…? లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అక్షింతలు అంటే కేవలం బియ్యం, పసుపు మాత్రమే కాదు. శాస్త్రోక్తంగా విశేష ఫలితాలు ఇచ్చే పంచ ద్రవ్యాలు. అక్షింతలు అంటే క్షతము (విరుగుడు) లేనివి అని అర్థమట. అయితే అక్షింతలు కలిపేటప్పుడు చాలా మంది నీళ్లు వేసి కలుపుతుంటారు. అలా చేయకూడదట. నీళ్లకు బదులు పచ్చిపాలు లేదా ఆవు నెయ్యి వాడాలని పండితులు సూచిస్తున్నారు. అయితే ముఖ్యంగా అక్షింతలు కలిపేటప్పుడు ఐదు రకాల వస్తువులు కలపాలట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పసుపు (Turmeric): అక్షింతలు కలిపేటప్పుడు తప్పనిసరిగా వాడాల్సింది పసుపు.  ఇది మంగళకరమైనది మరియు క్రిమిసంహారిణి. పసుపు బియ్యానికి రంగును, పవిత్రతను తీసుకువస్తుందట.

ఆవు నెయ్యి (Cow Ghee): అక్షింతలు ప్రిపేర్‌ చేసేటప్పుడు వాడాల్సిన రెండో వస్తువు ఆవు నెయ్యి. బియ్యానికి పసుపు అంటుకోవడానికి చాలా మంది  నూనె వాడుతుంటారు. నూనె అసలు వాడకూడదట. కేవలం ఆవు నెయ్యి మాత్రమే వాడాలట. చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

కుంకుమ (Vermilion): అక్షింతలు కలపడంలో వాడాల్సిన మూడో వస్తువు కుంకుమ. పసుపుతో పాటు కొద్దిగా కుంకుమ కలిపితే అవి ఎర్రటి అక్షింతలు అవుతాయి. ఇవి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజకు చాలా శ్రేష్ఠమని పండితులు చెప్తున్నారు. (పసుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు కుంకుమ వేయ్యాలట.. అలాగే ఎరుపు అక్షింతలు కలిపేటప్పుడు చిటికెడు పసుపు వెయ్యాలట).

పచ్చ కర్పూరం లేదా గంధం (Scented Material): అక్షింతలకు మంచి సువాసన రావడానికి చిటికెడు పచ్చ కర్పూరం లేదా గంధం పొడి కలపాలట. ఇలా చేయడం వల్ల ఆ అక్షింతలకు దేవ దేవతలు అట్రాక్ట్‌ అవుతారట.

పాలు : అక్షింతలు కలపడానికి ఎప్పుడైనా పచ్చి పాలను ఉపయోగించడం  అత్యంత శుభకరంగా చెప్తున్నారు పండితులు.  నీళ్లు కలపడానికి బదులుగా పాలు కలపడం మంచిదని సూచిస్తున్నారు.

అక్షింతలు ఎప్పుడు కలపాలి?:  అక్షింతలు కలిపడానిక ముందు శుచిగా  స్నానం చేయాలట. తర్వాత మడి బట్టలతో, దేవుడి నామస్మరణ చేస్తూ అక్షింతలు కలపడం వల్ల వాటికి దైవిక శక్తి వస్తుందట.

అక్షింతలు ఎలా వాడాలి?:  అక్షింతలను ఎప్పుడూ కుడి చేతితో, బొటనవేలు, మధ్యవేలు, ఉంగరపు వేలు కలిపి తీసుకుని దేవుడికి అక్షింతలలు వేయాలట. అయితే అక్షింతలకు చూపుడు వేలు తగలకూడదట.

అయితే ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అక్షింతలకు వాడే బియ్యం గింజలు విరిగి ఉండకూడదట. విరిగిన బియ్యం దోషపూరితమట. అందుకే నిండుగా ఉన్న బియ్యాన్ని ఏరుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మనం పూజలో అక్షింతలు వేస్తున్నామంటే దేవుడిని మన ఇంటికి రమ్మని లేదా మన పూజను స్వీకరించమని కోరుకోవడమని.. అంతటి పవిత్రమైన పిలుపు కోసం వాడే వస్తువు అత్యంత శ్రేష్ఠంగా ఉండాలని చెప్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: విదుర నీతి ప్రకారం భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు చేయకూడదట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×