E-Paper
Advertisement

Powerful Zodiac signs: ఆ నాలుగు రాశుల్లో పుట్టిన వారి మాటకు పవర్ ఎక్కువట

Powerful Zodiac signs: ఆ నాలుగు రాశుల్లో పుట్టిన వారి మాటకు పవర్ ఎక్కువట
Advertisement

Powerful Zodiac signs: ఆ నాలుగు రాశుల్లో పుట్టిన వారి మాటకు తిరుగుండదట. వారి మాటలకు పవర్‌ ఉంటుందట. వారి ఏదైనా బలంగా మాట్లాడితే అదే జరిగే చాన్స్‌ ఎక్కువగానే ఉంటుందట. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వారి మాట శాపంగా మారవచ్చట.. శని ప్రభావంతో శక్తివంతమైన వాక్ శుద్ధి ఆ 4 రాశుల్లో పుట్టిన వారికి ఉంటుందట. వారితో మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి… ఎందుకంటే ఆ రాశుల వారి మాటలకి karmic శక్తి ఉంటుందట. శని, కేతు ప్రభావం ఉన్న ఈ రాశుల వారు మౌనంగా ఉండేలా కనిపించవచ్చు, కానీ ఒక్క మాటతో ఎదుటి వాడి జీవితం మారిపోవచ్చట! వారి కోపం, వ్యంగ్యం, ఆత్మీయ ఆరాధన అన్నింటికీ ఫలితాలు ఉంటాయట. అటువంటి 4 శక్తివంతమైన రాశుల గురించి వారి మాటలకు ఉన్న శక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి (Scorpio):

Advertisement

ఈ రాశి వారు లోపల తీవ్ర భావాలతో నిండి ఉంటారు. శని మరియు కేతు ప్రభావం వల్ల వీరి మాటల వెనుక గంభీరమైన శక్తి ఉంటుందట. ముఖ్యంగా కోపంగా ఉన్నప్పుడు వారి మాటలు శాపంగా మారే అవకాశముంటుందట. ప్రేమతో పలికినా, వ్యంగ్యంగా మాట్లాడినా, వారి మాటల్లో karmic ప్రభావం ఉంటుందట. వారిని బాధపెడితే మౌనంగా ఉన్నా శక్తివంతమైన karmic ప్రతిస్పందన వస్తుందట.

కుంభ రాశి (Aquarius):

కుంభ రాశి వారు చాలా తార్కికంగా కనిపించవచ్చు కానీ వారి మాటలు చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేస్తాయట. శనిగ్రహ ప్రభావం వల్ల వారు న్యాయం కోసం మాట్లాడినప్పుడు విశేష karmic ఫలితాలు వస్తాయట. వారికి మాటల ప్రయోగం ఓ ఆయుధంలా ఉంటుందట. ఒకవేళ వారు బాధితునిగా అనిపిస్తే, వారు ఉచ్చరించిన ప్రతి మాట ఎదుటి వారి జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందట.

మకర రాశి (Capricorn):

Advertisement

శని స్వరాశి అయిన మకరం వారు తమ భావాలను ఎక్కువగా వ్యక్తపరచరాదట. కానీ మాట్లాడినప్పుడు, వారు వినిపించే మాటలు శక్తివంతమైన శాపంలా మారే సామర్థ్యం కలిగి ఉంటాయట. వారు ఇచ్చే అభిశాపం లాంటివి అసాధారణంగా నిజమయ్యే అవకాశముంటుందట. వీరి వాక్సిద్ధి వల్ల శుభవాక్యాలు ఆశీర్వాదంగా మారితే, కోపంగా వచ్చిన మాటలు శాపంగా మారవచ్చట.

మీన రాశి (Pisces):

ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉండే ఈ రాశివారు భక్తి భావనతో కూడిన మనసు కలిగివుంటారట. వారు చెప్పే మాటలు స్పృహతో పాటు ఆత్మశక్తిని కలిగి ఉంటాయట. దయ, మౌన సాధన వంటి సాధనల వల్ల వారి మాటలు ప్రభావవంతంగా మారుతాయట. ముఖ్యంగా బాధితుల కోసం పలికే ఆశీర్వచనాలు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇస్తాయట. అదే విధంగా, వ్యథతో వచ్చిన మాటలు శాపంలా మారే అవకాశమూ ఉంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమల అకామడేషన్ గురించి ఈ విషయాలు తెలుసా..? ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×