E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 20: ఆ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 20: ఆ రాశి ప్రేమికులకు అనుకూలమైన రోజు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 20వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృధా ఖర్చులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది. బంధువులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవదర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు కలుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 

వృషభం

Advertisement

నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

మిథునం

స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. 

కర్కాటకం

Advertisement

ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.

సింహం

దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. 

కన్య

పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వస్తుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. స్ధిరాస్తి సంభందిత క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.

వృశ్చికం

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధన పరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి. 

ధనుస్సు

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు.  

మకరం

బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన భూ లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. 

కుంభం

చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రమతో కూడిన దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఊహించని విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

మీనం

అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పొందుతారు. దాయాదులతో స్ధిరాస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×