E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారికి చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – వారికి చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 16వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. దూరప్రయాణాలు వీలైనంత వాయిదా వేయుట మంచిది.  ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.  మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. 

వృషభం

Advertisement

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. 

మిథునం

భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

కర్కాటకం

Advertisement

స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు.  ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహం

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది.  కుటుంబ సభ్యుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు.

కన్య

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది.  ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి.  చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు.

వృశ్చికం

ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.  చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు. 

ధనుస్సు

 వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తికానీ పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు.

మకరం

ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు తప్పవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. 

కుంభం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ విషయమై గృహమును ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మీనం

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో భాగస్తులు నుండి ఆశించిన సహాయం అందుతుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×