E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి నూతన వాహన యోగం

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి నూతన వాహన యోగం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 27వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఊహించని కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన  వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. 

వృషభం

Advertisement

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.  ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. 

మిథునం

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి.

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆప్తుల  నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం

నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో  గౌరవ మర్యాదలకు లోటుండదు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో సంతృప్తికరంగా సాగుతాయి. 

కన్య

గృహ నిర్మాణ విషయమై  ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన  పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు కొంత  నిదానంగా సాగుతాయి. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమౌతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వృశ్చికం

 ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

ధనుస్సు

ఉద్యోగమున అధికారులతో  చర్చలు సఫలం అవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో  కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

మకరం

ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన  పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు కొంత మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.  

కుంభం

ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహారించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మీనం

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. సోదరులతో భూ వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.  చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×