E-Paper
Advertisement

TVS iQube Electric Scooter: ఆకట్టుకుంటున్న టీవీఎస్ ఐక్యూబ్.. ఏకంగా 100కు పైగా ఫీచర్లు!

TVS iQube Electric Scooter: ఆకట్టుకుంటున్న టీవీఎస్ ఐక్యూబ్.. ఏకంగా 100కు పైగా ఫీచర్లు!
Advertisement

TVS iQube Electric Scooter 2025: టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా గుర్తింపు తెచ్చుకుంది. TVS మోటార్ కంపెనీ నుంచి వచ్చిన మోస్ట్ పాపులర్ స్కూటర్ గా మారిపోయింది.  ప్రస్తుతం ఈ స్కూటర్ పలు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

TVS iQube వేరియంట్లు,  ధరలు

⦿ బేస్ వేరియంట్ (2.2 kWh లేదా 3.1 kWh): రూ.96,000 నుంచి రూ. 1.25 లక్షల వరకు.

Advertisement

⦿ స్టాండర్డ్ (3.5 kWh): రూ.1.30 లక్షల నుంచి రూ.1.40 లక్షలు.

⦿ iQube S (3.5 kWh): రూ.1.40 లక్షల పైన.

Advertisement

⦿ iQube ST (3.5 kWh): రూ.1.50 లక్షల పైన.

⦿ టాప్ వేరియంట్ (ST 5.3 kWh): రూ.1.60 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు.

పైన చెప్పిన రేట్లన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. సగటు ధరలు సబ్సిడీలు, రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంటుంది. కచ్చితమైన ధరలు తెలియాలంటే టీవీఎస్ మోటార్స్ డీలర్స్ ను సంప్రదించాలి.

TVS iQube ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

TVS iQubeలో 4.4 kW BLDC హబ్ మోటార్ (టార్క్ 140 Nm) ఉంటుంది. 0-40 km/h కేవలం 4.2 సెకన్లలో అందుకుంటుంది. టాప్ స్పీడ్ 75-82 km/h (వేరియంట్ బట్టి) ఉంటుంది. రేంజ్ (IDC క్లెయిమ్) విషయానికి వస్తే.. 3.5 kWh బ్యాటరీ 145 km, 5.3 kWh బ్యాటరీ 212 km, బేస్ మోడల్స్ 100-150 km ఇస్తుంది. హోమ్ ఛార్జర్‌తో 4-6 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. స్టోరేజ్  32 లీటర్ల అండర్‌ సీట్ స్టోరేజ్ ఉంటుంది. రెండు హెల్మెట్లు ఫిట్ అవుతాయి.

Read Also:  బీఎండబ్ల్యూ To యమహా.. 2026లో లాంచ్ కాబోయే లగ్జరీ బైక్స్ ఇవే!

కనెక్టివిటీ విషయానికి వస్తే.. 7-ఇంచ్ TFT టచ్‌స్క్రీన్ (టాప్ వేరియంట్లలో), TVS SmartXonnect యాప్‌తో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్, రిమోట్ బ్యాటరీ స్టేటస్, వాయిస్ అసిస్ట్, అలెక్సా ఇంటిగ్రేషన్, ఓవర్ ది ఎయిర్ (OTA) అప్‌ డేట్స్, క్రాష్ అలర్ట్, జియోఫెన్సింగ్ లాంటి 118+ ఫీచర్లు ఉంటాయి. LED లైటింగ్, Q పార్క్ అసిస్ట్ (రివర్స్ మోడ్), రీజెనరేటివ్ బ్రేకింగ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ (ఎకో, పవర్)ను కలిగి ఉంటుంది. సేఫ్టీ విషయాన్ని పరిశీలిస్తే,  IP67 రేటెడ్ బ్యాటరీ, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.

TVS iQube సిటీ కమ్యూటింగ్‌కు అద్భుతంగా సూట్ అవుతుంది. లో రన్నింగ్ కాస్ట్ ఉంటుంది. కిలోమీటర్‌కు కేవలం 20 పైసలు ఖర్చు అవుతుంది. TVS సర్వీస్ నెట్‌ వర్క్ కూడా బాగుంది. అందుకే, దేశ వ్యాప్తంగా TVS iQubeకు మంచి ఆదరణ లభిస్తోంది.

Read Also: ఓలా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్, ఒక్క ఛార్జ్ తో 242 కి.మీ రేంజ్!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×