E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఉన్నత పదవులు లభిస్తాయి – వారికి ఆర్థిక పురోగతి

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఉన్నత పదవులు లభిస్తాయి – వారికి ఆర్థిక పురోగతి
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 3వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా అవసరానికి సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.  వ్యాపారాలలో ఆర్థిక లబ్ది కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.  వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. 

మిథునం

కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

కర్కాటకం

Advertisement

ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు శ్రమతో కూడి ఉంటాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

సింహం

వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి. 

కన్య

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయట సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి వలన నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

వృశ్చికం

వ్యాపార వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. 

ధనుస్సు

గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి ఉన్నత పదవులు పొందుతారు.  

మకరం

నూతన గృహ వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.  

కుంభం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉంటాయి.

మీనం

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వలన వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×