E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – వారు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – వారు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 1వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

దూర  ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్థులు అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో  ఏర్పడిన వివాదాలు కొంత మానసికంగా బాధిస్తాయి. 

వృషభం

Advertisement

ఉద్యోగమున సహోద్యోగులతో మాటపట్టింపులు తొలగుతాయి. నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధువుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి  ధన సహాయం అందుతుంది. ఇంటాబయటా మీ మాటకు విలువ  పెరుగుతుంది. 

మిథునం

విలువైన, వస్త్ర, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆకస్మిక లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ముఖ్యమైన పనులలో ఆశించిన విజయం సాధిస్తారు.

కర్కాటకం

Advertisement

గృహమున సంతాన వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల  ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన సమస్యలు  సర్దుమణుగుతాయి.  ఆర్థికపరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలు తీరుతాయి.

సింహం

సోదరుల మాటపట్టింపులుంటాయి. చేపట్టిన  కార్యక్రమాలు  సకాలంలో పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపార విషయాలలో  జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో  శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.   నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. 

కన్య

సంతాన విద్యా విషయాలలో  శుభవార్తలు అందుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు  సమసిపోతాయి. ఆర్ధిక సమస్యలు నుంచి కొంత వరకు బయటపడతారు. ఆర్థికంగా కొంత చికాకులు తప్పవు. గృహనిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగమున బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

నూతన  వ్యాపారాలకు  శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన గృహోపకరణాలు  కొనుగోలు చేస్తారు. కుటుంబ  సభ్యులతో వివాదాలు  రాజీ అవుతాయి. సంఘంలో  పెద్దలతో పరిచయాలు ఉత్సాహనిస్తాయి.

వృశ్చికం

ఆర్ధిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు  అందుతాయి. చేపట్టిన పనులలో  విజయం సాధిస్తారు. సంఘంలో  ప్రముఖుల నుంచి ఊహించని  ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి  సాధిస్తారు. 

ధనుస్సు

దూరపు బంధువులను కలుసుకుంటారు.  ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపార విషయంలో నిర్లక్ష్యం చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగులకు  పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో  జాగ్రత్తగా  వ్యవహరించాలి.

మకరం

వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ముఖ్యమైన పనులలో  తొందరపాటు పనిచేయదు. ఉద్యోగులకు పనిభారం పెరిగినా సమయానికి పనులు  పూర్తిచేస్తారు. ఆర్ధిక పరిస్థితి  కొంత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు నూతన  విద్యపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు  తీసుకుని ముందుకు సాగడం మంచిది.  

కుంభం

విలువైన వస్త్రా, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల వారి నుంచి అందిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి ఇతరుల సహాయం అందుతుంది. సంఘంలో ప్రముఖుల పరిచయాలు  పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు.  స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

మీనం

నిరుద్యోగులు విజయవంతంగా   ఇంటర్వ్యూకు హాజరవుతారు.  చేపట్టిన పనులు అప్రయత్నంగా  పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించి లాభాలు  పొందుతారు. మిత్రులతో కలిసి విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున  పురోగతి సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.  మొండి బాకీలు వసూలవుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×