E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – నిరుద్యోగులకు శుభవార్తలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 30వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 ఆశించిన రీతిలో రాబడి ఉండదు. బంధు మిత్రులతో ఆకస్మిక  వివాదాలు కలుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి  చికాకులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ  వాతావరణం కొంత గందరగోళంగా ఉంటాయి. 

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు  ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు  అందుకుంటారు. ఇంటా బయట  నూతన  విషయాలు తెలుస్తాయి. ఆర్ధిక పురోగతి కలుగుతుంది. 

మిథునం

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్ధిరాస్తి కొనుగోలు  ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది  కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన ఫలితాలు పొందుతారు.

కర్కాటకం

Advertisement

ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దైవ సేవా  కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

సింహం

దూర  ప్రయాణాలు వాయిదా పడతాయి.  వృత్తి, వ్యాపారాలు  మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో  అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ యత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ధన ఇబ్బందులుంటాయి. 

కన్య

సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో పరిస్థితి కలుగుతుంది. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. బంధుమిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపార ఉద్యోగ అంత సంతృప్తికరంగా సాగుతాయి. ఆదాయం మరింతగా పెరుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

 చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వృత్తి వ్యాపారములు  పరిస్థితి మరింత అనుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో ఆప్తుల  సలహాలు తీసుకోవడం మంచిది. భూ కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

వృశ్చికం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. చేపట్టిన  కార్యక్రమాలలో అవరోధాలు  కలుగుతాయి. ఇంటా బయట సమస్యలు మరింత పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి.  స్వల్ప  అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. 

ధనుస్సు

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువులుతో  ఊహించని వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో స్థిరత్వం లేని ఆలోచనలు చేయడం వలన మానసిక అశాంతి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తప్పవు. విద్యార్థులకు నిరుద్యోగులకు అధిక  కష్టం మీద స్వల్ప ఫలితం పొందుతారు.  

మకరం

గృహమున  శుభకార్య  వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. భూ సంబంధిత వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.  

కుంభం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు.  దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు.

మీనం

గృహంలో శుభకార్యాలు పరమైన ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు భవిష్యత్తు ఉపయోగపడతాయి. సోదరులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.  వృత్తి వ్యాపారాలలో ఒత్తిడిని అధిగమించి లాభాల అందుకుంటారు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×