E-Paper
Advertisement

Gandhi Talks ott : 25 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయ్ సేతుపతి మూవీ… ఈ సైలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Gandhi Talks ott : 25 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న విజయ్ సేతుపతి మూవీ… ఈ సైలెంట్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Advertisement

Gandhi Talks ott : విజయ్ సేతుపతి నటించిన మాటలు లేని చిత్రం ‘గాంధీ టాక్స్'(Gandhi Talks).  బొంబాయి నేపథ్యంలో సాగే ఈ మూకీ సినిమా, దాదాపు 25 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉంది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టబోతోంది. రెండు రోజుల క్రితం వచ్చిన యూట్యూబ్‌ ట్రైలర్ కి 40 లక్షలకు పైగా వ్యూస్‌ రావడం విశేషం. ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి.

థియేటర్లలోకి విజయ్ సేతుపతి మూవీ

ఇటీవలే బిగ్ బాస్ తమిళ సీజన్ 9ని హోస్ట్ చేసిన విజయ్ సేతుపతి నుంచి, ఈ సంవత్సరం వస్తున్న తొలి సినిమా ‘గాంధీ టాక్స్’ (Gandhi Talks). గాంధీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న విడుదల కానుంది ఈ సినిమా. లాక్‌డౌన్, గ్రామీ, మెలిసై వంటి తమిళ చిత్రాలతో పాటు ఈ సినిమా కూడా విడుదల కానుంది. ఇందులో అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ పాండురంగ్ బెలేకర్ దర్శకత్వం వహించాగా, AR రెహమాన్ సంగీతం అందించారు. డబ్బు కోసం మనుషులు ఎంతకి దిగజారుతారు, అవినీతి ఎలా ఉంటుంది అనే విషయాలను ఇందులో వ్యంగ్యంగా చూపించబోతున్నారు. ఇక ఈ సినిమా Zee5 ఓటీటీలో వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమా తీయడానికి ఎందుకు అన్నేళ్ళు పట్టింది 

Advertisement

దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ ఈ కథను సుమారు 15 ఏళ్ల పాటు తీర్చిదిద్దారు. తొలుత మూకీ సినిమా అనుకోలేదు, కానీ రాస్తుండగా మాటలు అవసరం లేదని గుర్తించి ప్రయోగాత్మకంగా మార్చారు. మాటలు లేని సినిమా కావడం వల్ల దీనికి సరైన నటీనటులను ఎంపిక చేయడానికి చాలా సమయం పట్టింది. ఇక 2021లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడ్డాయి. సినిమా నిర్మాణం 2022లో పూర్తయినప్పటికీ, పోస్ట్-ప్రొడక్షన్ పనులు, ఏ.ఆర్. రెహమాన్ సంగీతానికి తగినంత సమయం కేటాయించాల్సి వచ్చింది. చివరగా థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రాన్ని 2023లో అంతర్జాతీయ చలనచిత్ర వేదికలపై దీనిని ప్రదర్శించారు.

స్టోరీ ఏమిటంటే

ఒక నిరుద్యోగి (విజయ్ సేతుపతి) జాబ్ లేక, డబ్బులు ఎలా సంపాదించాలో తెలియక ఇబ్బంది పడుతుంటాడు. ఆ టైమ్‌లో తన కష్టాలన్నీ తీరిపోయి సెటిల్ అయిపోవాలని ఒక అడ్డదారి తొక్కుతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక పెద్ద బిజినెస్‌మెన్ (అరవింద్ స్వామి) ఆర్థికంగా చిక్కుల్లో పడతాడు. వీరిద్దరి జీవితాలు ఒక పాయింట్ దగ్గర కలిసినప్పుడు, ఒకరినొకరు మోసం చేసుకోవాలని చూసే క్రమంలో వచ్చే పరిస్థితులే ఈ సినిమా. ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారంటే.. సమాజంలో మనుషుల మాటల కంటే, కరెన్సీ నోట్ల మీద ఉండే గాంధీ బొమ్మే అందరితో మాట్లాడిస్తుందని దర్శకుడి ఆలోచన. ఇది ఒక మూకీ సినిమా, కాబట్టి కేవలం నటీనటుల ఎక్స్‌ప్రెషన్స్, ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ తోనే కథ మొత్తం నడుస్తుంది.

Advertisement

Read Also :  ‘ది ష్రింకింగ్ సీజన్ 3’ నుండి ‘వండర్ మ్యాన్’ వరకు… ఓటీటీలోకి అడుగు పెట్టిన న్యూ హాలీవుడ్ సిరీసులు ఇవే

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×