E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి – వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త –

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి – వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త –

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 8వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

కొన్ని పనులలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకర ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.  వృత్తి వ్యాపారాలు ఆటంకాలు తొలగుతాయి.

వృషభం

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సన్నిహితుల నుండి ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అంచనాలు నిజమవుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. 

మిథునం

ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. సంతాన అనారోగ్య విషయంలో సమస్యలుంటాయి. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.  ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

కర్కాటకం

వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.  సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి.

సింహం

వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. దాయదులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమౌతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి.  సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. 

కన్య

ఉద్యోగులకు అదనపు పనిబారం తప్పదు. కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ఖర్చుకు తగినంత ఆదాయం ఉండదు. దీర్ఘ కాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగాలలో వివాదాలు రాజి చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ధన వ్యవహారాలు ఉత్సహాన్నిస్తాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలసివస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.  దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు.

వృశ్చికం

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. 

ధనుస్సు

ఆర్థిక పరంగా మరింత పురోగతి కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

మకరం

గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పనితీరుకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి.  

కుంభం

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. మీప్రవర్తన వలన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఋణ దాతల ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం

 చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. బంధు మిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×