E-Paper
Advertisement

Horror Comedy OTT : యుద్ధం నుంచి బయటపడి దెయ్యం చేతిలో బుక్కయ్యే అమాయకుడు… భయపెడుతూనే నవ్వించే హర్రర్ మూవీ

Horror Comedy OTT : యుద్ధం నుంచి బయటపడి దెయ్యం చేతిలో బుక్కయ్యే అమాయకుడు… భయపెడుతూనే నవ్వించే హర్రర్ మూవీ
Advertisement

Horror Comedy OTT : హర్రర్ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ తగ్గదు. మామూలుగా అయితే ఎక్కువగా హాలీవుడ్ హర్రర్ సినిమాలను చూస్తూ ఉంటారు. ఇక ఓటీటీలో ఉన్న ఇండియన్ భాషలలో ఉన్న సినిమాలను చూస్తూ ఉంటారు. కానీ దాదాపుగా ఆయా భాషల్లో వచ్చిన సినిమాలు అన్నింటినీ ఓటీటీల పుణ్యమా అని చూసే ఉంటారు. ఇప్పుడు ఏదైనా కొత్తగా ఉండే హర్రర్ స్టోరీ అయితే చూడడానికి బాగుంటుంది అనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. ఇది అలాంటి ఇలాంటి ఆషామాషీ హర్రర్ సినిమా కాదు. కామెడీ కూడా కావలసినంత ఉంటుంది. మరి ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

యాపిల్ టీవి ప్లస్ ఓటీటీలో అందుబాటులో

ఈరోజు మూవీ సజెషన్ లో మనం చెప్పుకుంటున్నది థాయ్ హర్రర్ సినిమా గురించి. థాయ్ సినిమాల్లో ఆల్ టైమ్ బ్లాక్‌ బస్టర్ హిట్ గా పేరు తెచ్చుకున్న సినిమా ‘పీ మాక్’ (Pee Mak Phrakanong). 2013లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు బంచోంగ్ పిసంథనకున్ దర్శకత్వం వహించారు. అక్కడి పురాణాల ప్రకారం లెజెండ్ మే నాక్ ప్రకానాంగ్ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

Advertisement

GMM టై హబ్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీలో డ్స్ మారియో మారర్, దవికా హూర్నే ప్రధాన పాత్రలు పోషించారు. నత్తపోంగ్ చార్ట్‌పోంగ్, పుత్తిచై అమాత్యకుల్, విచై జుంగ్‌ రుంగ్‌ రీకిట్, కాంతపట్ పెర్మ్‌పూన్‌పాచ్ కీ రోల్స్ పోషించారు. 1 గంట 52 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ మూవీని 2013 మార్చి 28న థాయ్‌లాండ్‌లో విడుదల చేశారు. అక్కడ ఈ మూవీకి ఎంత మంచి రెస్పాన్స్ దక్కింది అంటే… ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ (600 మిలియన్ బాట్) గా రికార్డును సృష్టించింది. ఇప్పుడు ఈ మూవీని ఆపిల్ టీవీ+ (Apple TV+)లో చూడవచ్చు.

Read Also :  రొమాన్స్ నుంచి క్రైమ్ -కామెడీ వరకు… జనవరిలో రిలీజ్ కాబోతున్న కొరియన్ సినిమాలు, సిరీస్ లు ఇవే…

స్టోరీలోకి వెళ్తే…

Advertisement

సినిమాను 19వ శతాబ్దం రతనకోసిన్ యుగంలో తెరకెక్కించారు మేకర్స్. మాక్ (మారియో మారర్) సైనికుడుగా పని చేస్తాడు. పెళ్ళాన్ని ఒంటరిగా వదిలేసి యుద్ధంలో పాల్గొనడానికి వెళతాడు. కానీ ఆ యుద్ధంలో గాయపడి తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చేటప్పుడు తన ఫ్రెండ్స్ టెర్, అయ్, షిన్, మాన్‌ లను తన విలేజ్‌కి తీసుకొస్తాడు. యుద్ధానికి ముందే మాక్ నాక్ (దవికా హూర్నే)ని పెళ్లి చేసుకుంటాడు. కొన్ని రోజులకే ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఇక పుట్టిన బిడ్డను చూద్దామని ఆశతో వస్తాడు మాక్. కానీ ఆ విలేజ్‌లో నాక్, ఆమె బేబీ ఇద్దరూ చనిపోయారని చెప్పుకుంటారు. అయితే మాక్ ఇంటికి రాగానే తన భార్య నాక్‌ ని చూసి షాక్ అవుతాడు. అందరూ ఆమె చనిపోయింది అని చెప్తారు. కానీ ఆమెతో పాటు బిడ్డ కూడా బతికే ఉంటుంది. దీంతో ఆమెను చూసి మాక్ ఫ్రెండ్స్ భయపడతారు. నాక్ దెయ్యం అని అతనితో చెప్తారు. మరి నాక్ నిజంగా దెయ్యమా ? ఆమె చనిపోయింది అని ఎందుకు చెప్పారు ? క్లైమాక్స్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే మూవీని చూడాల్సిందే.

Tags

Related News

స్కూల్లో చేయకూడని పని… కట్ చేస్తే రౌడీ సీఈఓతో… మనసును హత్తుకునే కొరియన్ ప్రేమ కథ

మానవాళి మనుగడ కోసం క్రూరమైన రాక్షసులతో వార్… సెన్సేషనల్ యానిమే సిరీస్ తెలుగులో

డాన్ సామ్రాజ్యానికి రాణిగా మారే ఛాన్స్… ఈ క్రైమ్ అండ్ బోల్డ్ డ్రామాలో సస్పెన్స్ పీక్స్

ఖైదీలపై డేంజరస్ మైండ్ ఎక్స్‌పెరిమెంట్స్… మైండ్ బెండింగ్ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్

కారు సీటు కిందే బాంబు… డ్రైవింగ్ ఆపితే ప్రాణాలు గాల్లో… 90 నిమిషాల సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్

 పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్‌ థ్రిల్లర్ ను డోంట్ మిస్

అపార్ట్‌మెంట్ మెట్లపై అబ్బాయి మిస్సింగ్… ఒక్కో ట్విస్ట్ ఉంటది భయ్యా

బాయ్స్ టీమ్‌కు కెప్టెన్ గా అమ్మాయి… క్రేజీ యూత్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా

Big Stories

Advertisement
×