E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆర్థిక లాభాలు – రుణాలు వసూలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆర్థిక లాభాలు – రుణాలు వసూలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మార్చి 16వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వాహన సంభందిత వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. ఇతరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. 

వృషభం

Advertisement

బంధు మిత్రులతో అకారణ వివాదములకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులందు ఆటంకములు కలిగిన సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. భాగసౌమ్య వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. 

మిథునం

ముఖ్యమైన పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యవహారములు మరింత పుంజుకుంటాయి. వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. బంధు మిత్రుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

కర్కాటకం

Advertisement

నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు. సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

సింహం

వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. గృహ వాహన సంబంధిత క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. 

కన్య

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి. స్వల్ప ధన లాభ సూచనలున్నవి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి వ్యాపారాలలో చికాకులు తప్పవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వ్యవహారములు చిన్నపాటి సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం

దూరపు బంధువుల నుండి కొంత కీలక సమాచారం సేకరిస్తారు. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుమణుగుతాయి. ఉద్యోగమున విధులు సమర్ధవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. 

ధనుస్సు

దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  

మకరం

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం ఉండదు. నూతన వ్యాపార ప్రారంభమునకు ఆటంకాలుంటాయి. ఉద్యోగ విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. 

కుంభం

సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి ఊహించని బహుమతులు అందుకుంటారు. గృహమున వివాహ శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారములు అనుకూలంగా సాగుతాయి. సంతానం విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం

ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా రాణిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సంతాన విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక లాభాలు అందుతాయి. మిత్రుల నుండి శుభ వార్తలు అందుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×