E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – రాజకీయ ప్రముఖులతో పరిచయాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – రాజకీయ ప్రముఖులతో పరిచయాలు  
Advertisement

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన అక్టోబర్‌ 28వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:  

చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. బంధువర్గం నుండి ఆర్థిక సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.

వృషభ రాశి:

Advertisement

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు తప్పవు. ఆస్తి వివాదాలు మానసిక చికాకును కలిగిస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. పనులలో జాప్యం కలుగుతుంది.

మిథున రాశి:  

వ్యాపార  విషయంలో  ఆకస్మిక నిర్ణయాలు వలన నష్టాలు తప్పవు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.  పుణ్యక్షేత్రాలు  సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన పనులు శ్రమతో గాని పూర్తి కావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

కర్కాటక రాశి:

Advertisement

స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.

సింహరాశి:

వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

కన్యారాశి :

విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువర్గంతో వివాదాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వ్యాపార వ్యవహారాలలో  ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికరాశి:

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత పెరుగుతుంది. విందు వినోద కార్యక్రమాలకు ధనవ్యయం చేస్తారు.

ధనస్సు రాశి:

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలతో తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. సోదరులతో ఒప్పందాలు వాయిదా వేస్తారు.  ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయటం మంచిది. దైవచింతన పెరుగుతుంది.

మకరరాశి:

చిన్ననాటి మిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

కుంభరాశి:

చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది.  స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో అకారణ మాటపట్టింపులు కలుగుతాయి.

మీనరాశి:

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలిగినప్పటికి నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహం కలుగుతుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×